Breaking News

డ్రైవర్‌ జీతం నెలకు రూ.4 లక్షలు..! అంబానీయా.. మజాకా..

Published on Thu, 05/01/2025 - 14:01

సాధారణంగా కారు డ్రైవర్‌ జీతం నెలకు రూ.వేలల్లో ఉంటుందని అందరూ అనుకుంటారు. అయితే దేశంలోని అత్యంత సంపన్నుడిగా పేరొందిన ముఖేశ్‌ అంబానీ కారు డ్రైవర్‌ వేతనం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. నెలకు సుమారు రూ.2 లక్షలు-రూ.4 లక్షలు! ఇంతకీ ఓ కారు డ్రైవర్‌కు ఎందుకు ఇంత ప్యాకేజీ ఇస్తున్నారో తెలుసుకోవాలనుందా? అయితే వెంటనే కింది వివరాలు చదవాల్సిందే.

ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈనేపథ్యంలో ఆయనకు పటిష్టమైన భద్రత ఉంటుంది. ఉదయం తాను లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేవరకు పక్కా ప్రణాళికతో భద్రత సిబ్బంది వ్యవహరిస్తుంది. ఈ తరుణంలో ఆయన ఒక చోట నుంచి మరో చోటుకు ‍కారులో ప్రయాణిస్తున్న సమయంలో భద్రతలోనూ రాజీ పడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా డ్రైవింగ్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న వారిని ఎంచుకుంటారు.

అంబానీ కారు డ్రైవర్‌ను సాధారణ డ్రైవర్ మాదిరిగా కాకుండా నేరుగా నియమించలేరు. ప్రత్యేకంగా ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా వీరిని ఎంపిక చేస్తారు. ఈ ఏజెన్సీలు ఎంపిక చేసే డ్రైవర్లు కేవలం వాహనం నడిపేందుకే కాదు.. వెపన్‌ ట్రెయినింగ్‌లోనూ శిక్షణ పొందుతారు. బుల్లెట్ ప్రూఫ్ లగ్జరీ వాహనాలను నడిపిందుకు కఠినమైన ట్రయినింగ్‌ తీసుకుంటారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ వాహనాన్ని సజావుగా, సురక్షితంగా నడిపగలరు. అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకునే విన్యాసాలు, భద్రతా బెదిరింపులకు వెంటనే ప్రతిస్పందించేలా వీరికి శిక్షణ ఉంటుంది.

ఇదీ చదవండి: టారిఫ్‌ల ఎఫెక్ట్‌.. టాప్‌ కార్ల తయారీ కంపెనీ ఔట్‌!

అంబానీ కార్లు తన అభిరుచులకు తగ్గట్టుగా ప్రత్యేకంగా తయారు చేయబడి ఉంటాయి. సాధారణ కార్లతో పోలిస్తే ప్రత్యేకంగా ఉంటాయి. ఇవి సాయుధ వాహనాలు. ఇందుకు ప్రత్యేక డ్రైవింగ్‌ నైపుణ్యాలు అవసరం అవుతాయి. దాంతోపాటు కేవలం రద్దీ రోడ్లపై వాహనం నడపడమేకాదు, ఈ డ్రైవర్లు అధిక ఒత్తిడి పరిస్థితులకు సిద్ధంగా ఉంటారు. సాధారణ డ్రైవర్ల మాదిరిగా కాకుండా వీరు రహస్య షెడ్యూల్స్, వీఐపీ ప్రోటోకాల్స్‌కు లోబడి పని చేయాల్సి ఉంటుంది. అందుకే వీరికి అధిక వేతనం ఇస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)