Breaking News

బ్రెయిన్‌ మ్యాపింగ్‌ హెల్మెట్‌

Published on Sun, 10/06/2024 - 11:28

ఇది మామూలు హెల్మెట్‌ కాదు, బ్రెయిన్‌ మ్యాపింగ్‌ హెల్మెట్‌. ఈ హెల్మెట్‌ మెదడు పరిస్థితిని తెలుసుకునేందుకు చేసే ‘ఎలక్ట్రో ఎన్‌సెఫాలోగ్రామ్‌’ (ఈఈజీ) పరీక్షకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. దక్షిణ కొరియాకు చెందిన ‘ఐ మెడి సింక్‌’ కంపెనీ ఈ హెల్మెట్‌ను ‘ఐ సింక్‌వేవ్‌’ పేరుతో రూపొందించింది.

మెదడు పరీక్షలను నిర్వహించడానికి ఖరీదైన ఈఈజీ మెషిన్లకు బదులుగా ఆస్పత్రుల్లోని వైద్యులు ఈ బ్రెయిన్‌ మ్యాపింగ్‌ హెల్మెట్‌ను ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఈఈజీ మెషిన్‌ ద్వారా మెదడు పరీక్ష జరిపించుకోవాలంటే, అడ్హెసివ్‌ ప్యాచ్‌లు, జెల్‌ వాడాల్సి ఉంటుంది. ఈ హెల్మెట్‌కు అవేవీ అవసరం లేదు. నేరుగా తలకు ధరిస్తే చాలు, నిమిషాల్లోనే మెదడు లోపలి పరిస్థితిని తెలియజేస్తుంది.

ఇది రీచార్జబుల్‌ లిథియం అయాన్‌ బ్యాటరీతో పనిచేస్తుంది. ఒకసారి చార్జ్‌ చేసుకుంటే, ఏడు గంటల సేపు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని లోపలి భాగంలోని 19 ఎల్‌ఈడీ బల్బులు మెదడును క్షుణ్ణంగా స్కాన్‌ చేస్తాయి. అల్జీమర్స్‌ వ్యాధి వంటి మెదడు సంబంధిత వ్యాధులను దీని ద్వారా ముందుగానే గుర్తించవచ్చు. దీని ధర 6.54 కోట్ల వాన్‌లు (రూ. 41.04 లక్షలు).

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)