Breaking News

పెరిగిన యస్‌ బ్యాంక్‌ లాభం: రూ. 654 కోట్లు

Published on Sun, 10/19/2025 - 12:56

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రైవేట్‌ రంగ యస్‌ బ్యాంక్‌ నికర లాభం రూ. 654 కోట్లకు చేరింది. గత క్యూ2లో నమోదైన రూ. 553 కోట్లతో పోలిస్తే 18 శాతం పెరిగింది. ఇక లోన్‌బుక్‌  6.4 శాతం వృద్ధి చెందడంతో కీలకమైన నికర వడ్డీ ఆదాయం 0.10 శాతం మెరుగుపడి 4.6 శాతానికి చేరింది. ఇతర ఆదాయం 16.9 శాతం పెరిగి రూ. 1,644 కోట్లుగా నమోదైంది.

తాజా స్లిప్పేజీలు అంతక్రితం త్రైమాసికంలో ఉన్న రూ. 1,458 కోట్ల నుంచి రూ. 1,248 కోట్లకు దిగివచ్చాయి. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి పెద్దగా మార్పు లేకుండా 1.6 శాతం స్థాయిలో కొనసాగుతోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 శాతం స్థాయి రుణ వృద్ధి సాధించాలని నిర్దేశించుకున్నట్లు బ్యాంక్‌ ఎండీ ప్రశాంత్‌ కుమార్‌ చెప్పారు. ఇకనుంచి నికర వడ్డీ మార్జిన్లు మరింత మెరుగుపడగలవని ఆయన పేర్కొన్నారు. జపాన్‌ దిగ్గజం ఎస్‌ఎంబీసీ 24 శాతం పైగా వాటాను కొనుగోలు చేసినప్పటికీ, తక్షణమే వ్యాపార ప్రణాళికల్లో మార్పులేమీ ఉండబోవని కుమార్‌ వివరించారు. భవిష్యత్‌ ప్రణాళికలను నిర్దేశించే వార్షిక సర్వసభ్య సమావేశం యథా ప్రకారంగానే జరుగుతుందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 80 శాఖలను ప్రారంభించే ప్రణాళికలు ఉన్నట్లు వివరించారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)