Breaking News

రూ.3 లక్షల కోట్లు దాటిన యస్‌ బ్యాంక్‌ డిపాజిట్లు

Published on Sun, 04/19/2026 - 12:04

ముంబై: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో యస్‌ బ్యాంక్‌ నికర లాభం స్టాండెలోన్‌ ప్రాతిపదికన 45 శాతం ఎగిసి రూ.1 ,068 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో ఇది రూ. 739 కోట్లు. మొత్తం ఆదాయం రూ. 9,356 కోట్ల నుంచి రూ. 9,381 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ. 7,616 కోట్ల నుంచి రూ. 7,650 కోట్లకు పెరిగింది.

మొండిబాకీలకు ప్రొవిజనింగ్‌ 41 శాతం తగ్గి రూ. 187 కోట్లకు పరిమితమైంది. కార్పొరేట్‌ రుణాల విభాగం దన్నుతో రుణ వృద్ధి 10.7 శాతం మేర పెరిగింది. నికర వడ్డీ మార్చిన్‌ 2.5 శాతం నుంచి 2.7 శాతానికి మెరుగుపడింది. డిపాజిట్లు రూ. 3 లక్షల కోట్ల మైలురాయిని దాటాయి. కాసా (కరెంట్‌ అకౌంట్, సేవింగ్స్‌ అకౌంట్‌) డిపాజిట్లు రూ. 1 లక్ష కోట్లకు చేరుకున్నాయి.  

కొత్త ఎండీ, సీఈవోగా వినయ్‌ ఎం టోన్సే బాధ్యతలు చేపట్టాక బ్యాంకు ఆర్థిక ఫలితాలు ప్రకటించడం ఇదే తొలిసారి. 2025–26 ఆర్థిక సంవత్సరాన్ని గైడెన్స్‌కి అనుగుణంగా పటిష్టమైన ఫలితాలతో ముగించినట్లు ఆయన తెలిపారు. రాబోయే రెండు, మూడేళ్లలో మార్జిన్లను 3.25 – 3.50 శాతం స్థాయికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు.

నికర వడ్డీ మార్జిన్లు 20 బేసిస్‌ పాయింట్ల మేర మెరుగుపడినట్లు చెప్పారు. 2020 ఆర్థిక సంవత్సరం మొండిపద్దులు అత్యంత కనిష్ట స్థాయికి నెమ్మదించాయని పేర్కొన్నారు. మరింత మెరుగైన వృద్ధిని సాధించడంపై ప్రధానంగా దృష్టి పెడుతూ ముందుకు సాగనున్నట్లు వివరించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)