యమహా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ వచ్చేసింది..

Published on Mon, 02/02/2026 - 17:17

యమహా మోటార్ ఇండియా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ‘ఈసీ-06’ (EC-06)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 1.67 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ప్రారంభ దశలో యమహా డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కూటర్‌ను బ్లూయిష్ వైట్ అనే సింగిల్ కలర్ ఆప్షన్‌లో అందిస్తున్నారు.

డిజైన్
యమహా EC-06 చూడటానికి రివర్ ఇండీ లాగానే కనిపించినప్పటికీ, ఇందులో ప్రత్యేకమైన డిజైన్ డీటైల్స్‌ ఉన్నాయి. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ సెటప్, రేక్డ్, మస్కులర్ ఫ్రంట్ ఆప్రాన్ దీనికి ప్రత్యేక గుర్తింపునిస్తుంది. సైడ్ ప్రొఫైల్‌లో వంపులు తిరిగిన బాడీ ప్యానెల్స్‌తో ఆధునిక లుక్‌ను కలిగి ఉంది. రివర్ ఇండీతో పోలిస్తే, EC-06లో కాస్త తక్కువ 24.5 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ ఇచ్చారు.

బ్యాటరీ, రేంజ్
ఈ స్కూటర్‌లో 4 kWh ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు.  దీనికి 8.9 bhp పవర్, 26 Nm టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌ జత చేశారు. EC-06 గరిష్ట వేగం గంటకు 79 కి.మీ.,  ఒకసారి పూర్తి ఛార్జ్‌తో 169 కి.మీ. సర్టిఫైడ్ రేంజ్  అందిస్తుందని కంపెనీ చెబుతోంది. బ్యాటరీపై 3 సంవత్సరాలు లేదా 30,000 కి.మీ. వారెంటీ ఇస్తోంది.

ఛార్జింగ్ & రైడింగ్ మోడ్స్
సాధారణ గృహ విద్యుత్ సాకెట్ ద్వారా ఈ స్కూటర్‌ను ఛార్జ్ చేయవచ్చు.  ఫుల్ ఛార్జ్‌కు సుమారు 8 గంటలు పడుతుంది. EC-06లో ఎకో, స్టాండర్డ్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అదనంగా రివర్స్ మోడ్ కూడా అందుబాటులో ఉంది.

ఫీచర్లు
ఈ స్కూటర్‌లో ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇందులో వేగం, బ్యాటరీ స్థాయి, రైడింగ్ మోడ్‌లు, కనెక్టివిటీ వివరాలు వంటి ముఖ్యమైన సమాచారం కనిపిస్తుంది. యమహా మొబైల్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ  సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.

సస్పెన్షన్ & బ్రేకులు
సస్పెన్షన్ విషయానికి వస్తే.. ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక డ్యూయల్ షాక్ అబ్జార్బర్లు ఇచ్చారు. ముందు, వెనుక 200 మిమీ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) దీని ‍ప్ర​త్యేకతగా కంపెనీ పేర్కొంది.

Videos

Oracle: ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్ భారీగా ఉద్యోగాలు కోత

జోగి ఇంటిపై దాడి కేసులో 11 మంది అరెస్ట్.. వెంటనే రిలీజ్

జోగి ఇంటిపై దాడి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

ఇది ఇక్కడితో ఆగదు ఫ్యాన్స్ కు చిరు సర్ప్రైజ్

Jogi Ramesh: నువ్వు పెద్ద పుడింగిలా ఫీల్ అవ్వకు నీ రెడ్ బుక్ మడిచి పెట్టుకో..

తగిన మూల్యం చెల్లిస్తారు..అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడి తమ్మినేని సీతారాం సీరియస్ రియాక్షన్

TVK Vijay: విజయం మనదే..! ఇది ఫిక్స్

Advocate Rajini: టీడీపీ గూండాలపై ఫిర్యాదు..

కులం పేరుతో దూషించారు మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు.. అంబటి అల్లుడు వార్నింగ్

కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటది... సజ్జల వార్నింగ్

Photos

+5

ఈషా రెబ్బా 'ఓం శాంతి' జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

దుబాయిలో చిల్ అయిపోతున్న దివ్య భారతి (ఫొటోలు)

+5

వితికా షేరు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దుబాయిలో అల్లు శిరీష్ బ్యాచిలరేట్ పార్టీ (ఫొటోలు)

+5

‘ఫంకీ’ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్‌ కయాదు లోహర్‌ (ఫొటోలు)

+5

అనంతపురం : సినీతారల క్రికెట్‌ మ్యాచ్‌..శ్రీకాంత్, తరుణ్‌ సందడి (ఫొటోలు)

+5

‘బరాబర్‌ ప్రేమిస్తా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

మై సౌత్‌ దివా 9వ ఎడిషన్‌ క్యాలెండర్‌ లాంచ్ లో మెరిసిన అందాల భామలు (ఫొటోలు)

+5

అందాల సినీతార ఉల్కా గుప్తా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌.. ఫుల్‌ రష్‌ (ఫొటోలు)