Breaking News

నేడు 500 మంది ఉద్యోగులకు సెలవు!! కారణం తెలిస్తే..

Published on Mon, 07/01/2024 - 14:40

దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి మన జట్టు వరల్డ్‌ కప్‌ గెలిస్తే ఆ సంబరం ఎలా ఉంటుంది. భారత్‌ టీ20 ప్రపంచ కప్‌ గెలవడంతో ఊరూరా సంబరాలు జరుగుతున్నాయి. తమ ఉద్యోగులు కూడా సంబరాలు చేసుకునేందుకు ఏకంగా సెలవు ఇచ్చేసిందో కంపెనీ.

భారత్‌ టీ20 క్రికెట్ ప్రపంచకప్‌ విజయాన్ని పురస్కరించుకుని స్టాఫింగ్ సంస్థ ఎక్స్‌ఫెనో తన ఉద్యోగులందరికీ జూలై1న సెలవు దినంగా ప్రకటించింది. ఈ కంపెనీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఇందులో సుమారు 500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.  

"ఇది మా అందరికీ ఆశ్చర్యం కలిగించింది. బిల్లింగ్‌లు, పేరోల్ క్లోజర్స్‌ వంటివి ఉన్నందున నెలలో మొదటి రోజు సాధారణంగా బిజీగా ఉంటుంది. కానీ టీమ్ ఇండియా గొప్ప విజయాన్ని సాధించడంతో ఆ రోజును సెలవుగా ప్రకటించాలని కంపెనీ నిర్ణయించింది" అని ఎక్స్‌ఫెనో వర్క్‌ఫోర్స్ రీసెర్చ్ హెడ్ ప్రసాద్ ఎంఎస్‌ చెప్పినట్లుగా మనీకంట్రోల్‌ పేర్కొంది.

ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్‌ ప్రపంచ కప్ యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్ సంయుక్తంగా వేదికగా జూన్ 1 నుంచి జూన్ 29 వరకు జరిగింది. ఇందులో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో రాణించి ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి కప్‌ను కైవసం చేసుకుంది.

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)