Breaking News

లాంచ్‌ అయిన 3 నిమిషాల్లోనే 2 లక్షల బుకింగ్స్‌

Published on Mon, 06/30/2025 - 13:13

చైనా ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ కంపెనీ షావోమీ ఎస్‌యూ 7 మోడల్‌ తర్వాత తన రెండో ప్రోడక్ట్‌ వైయూ 7ను చైనా మార్కెట్‌లో ఇటీవల లాంచ్‌ చేసింది. దీన్ని ఆవిష్కరించిన కొద్ది గంటల్లోనే రికార్డ్‌ స్థాయిలో బుకింగ్స్‌ వచ్చాయని కొన్ని సంస్థలు పేర్కొన్నాయి. కేవలం లాంచ్‌ అయిన 3 నిమిషాల్లోనే 2,00,000కు పైగా ఆర్డర్లు వచ్చాయని తెలిపాయి. దీని ధర వేరియంట్‌ను అనుసరించి సుమారు రూ.30.22 లక్షల(ఎక్స్‌షోరూమ్‌) నుంచి ప్రారంభం అవుతుందని కంపెనీ చెప్పింది.

రాయిటర్స్ కథనం ప్రకారం.. ఈ కారు లాంచ్‌ అయిన 3 నిమిషాల్లోనే 2,00,000కు పైగా ఆర్డర్లు, 18 గంటల్లో 2.40 లక్షల ఆర్డర్లు, 24 గంటల్లో 2.89 లక్షల ఆర్డర్లను లాక్ చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం చైనాలోని మొత్తం 351 షావోమీ ఈవీ రిటైల్ స్టోర్లలో వైయూ7 బుకింగ్స్ జరుగుతున్నాయి. అయితే షావోమీ ఇప్పటి వరకు ఎన్ని ఆర్డర్లు పొందిందో మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.

ఇదీ చదవండి: అనంత్‌ అంబానీ జీతం ఎంతో తెలుసా..?

ఫీచర్లు ఇవే..

  • ఈ వైయూ7 మోడల్‌లో 320 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మోటార్‌ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. 

  • 528 ఎన్‌ఎం టార్క్‌తో గంటకు 240 కిలోమీటర్లు టాప్‌ స్పీడ్‌తో ఈ వేరియండ్‌ను లాంచ్‌ చేసినట్లు చెప్పింది. 

  • 0-100 కిమీ/గంట వేగాన్ని 5.9 సెకన్లలోనే అందుకుంటుందని పేర్కొంది. 

  • ఒకసారి బ్యాటరీ ఛార్జ్‌ చేస్తే 835 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని చెప్పింది. 

  • 21 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జ్‌ అవుతుందని పేర్కొంది.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)