Breaking News

స్మార్ట్‌ఫోన్ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ కారు - సింగిల్ ఛార్జ్‌తో 800కిమీ రేంజ్

Published on Thu, 12/28/2023 - 16:37

చైనాలోని బీజింగ్‌లో గురువారం జరిగిన 'షావోమి' (Xiaomi) ఈవీ టెక్నాలజీ లాంచ్ ఈవెంట్ వేదికగా.. కంపెనీ తన సరికొత్త ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించింది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఆవిష్కరించిన ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

షావోమి కంపెనీ మార్కెట్లో విడుదల చేయనున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు 'SU7' (స్పీడ్ అల్ట్రా7). ఇది ప్రపంచ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న అగ్ర సంస్థల ఎలక్ట్రిక్ కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉండనున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో తప్పకుండా గొప్ప గుర్తింపు పొందటానికి కంపెనీ కృషి చేస్తున్నట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.

SU7 అనేది నాలుగు డోర్స్ కలిగిన ఎలక్ట్రిక్ కారు. ఇది అద్భుతమైన డిజైన్ కలిగి, ఆధునిక ఫీచర్స్ పొందనుంది. పరిమాణం పరంగా ఉత్తమంగా ఉండే ఈ కారు 73.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి, ఒక సింగిల్ చార్జితో గరిష్టంగా 800కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది.

2025నాటికి లాంచ్
షావోమి ఎలక్ట్రిక్ కారు 2025 నాటికి మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కార్లు మొత్తం చైనాలోని బీజింగ్‌ తయారీ కర్మాగారంలోనే తయారవుతాయని కంపెనీ వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే ఈ కార్లు చైనా నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదీ చదవండి: రతన్ టాటా గురించి ఐదు ఆసక్తికర విషయాలు

అంచనా ధర
SU7 ధరలు 200000 యువాన్‌ల నుంచి 300000 యువాన్‌ల వరకు ఉండే అవకాశం ఉంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ. 25 లక్షల నుంచి రూ. 35 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ కారు భారతీయ మార్కెట్లో విడుదలవుతుందా.. లేదా అనేదానిపైన అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)