Breaking News

ఒకసారి ఛార్జ్‌ చేస్తే హైదరాబాద్‌ టు శ్రీకాకుళం!

Published on Wed, 03/13/2024 - 09:46

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షావోమీ తాజాగా తమ తొలి విద్యుత్‌ కారును ఆవిష్కరించింది. బీజింగ్‌లో జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీఈఓ ‘లీ జున్‌’ దీన్ని పరిచయం చేశారు. ఎస్‌యూ7గా వ్యవహరించే ఈ కారును మార్చి 28న చైనాలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ సెడాన్‌లో ఉన్న ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కంపెనీ ప్రముఖ ఫోన్లతో అనుసంధానమయ్యేలా రూపొందించారు. చైనాలో దిగ్గజ కంపెనీలుగా పేరొందిన ‘కాన్‌టెంపరరీ యాంపరెక్స్‌ టెక్నాలజీ’, బీవైడీ నుంచి తీసుకున్న బ్యాటరీలను ఈ కార్లలో వాడుతున్నారు.

భవిష్యత్తులో ప్రపంచంలో తొలి ఐదు దిగ్గజ వాహన తయారీ సంస్థల్లో ఒకటిగా నిలుస్తామని లీ జున్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ కారుని ‘సెల్‌-టు-బాడీ’ టెక్నాలజీతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. దీంతో బ్యాటరీని నేరుగా వాహన నిర్మాణానికే అనుసంధానం చేసినట్లు వివరించారు. ఫలితంగా కారు దృఢత్వం పెరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికే కంపెనీ రూపొందించిన అనేక యాప్‌లకు ఈ కారులో యాక్సెస్‌ ఉంటుందన్నారు. 

ఈ కారు ఎస్‌యూ7, ఎస్‌యూ7 మ్యాక్స్‌ పేరిట రెండు వేరియంట్లలో లభించనుంది. ఎస్‌యూ 7 విషయానికి వస్తే.. 0-100 kmph వేగాన్ని 5.28 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది. అలాగే ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 668 కిలోమీటర్లు వెళ్తుంది. గరిష్ఠ వేగం 210 కి.మీ/గం. అత్యధికంగా 400 ఎన్‌ఎం టార్క్‌ వద్ద 299 పీఎస్‌ శక్తిని విడుదల చేస్తుంది.

ఇదీ చదవండి: కంపెనీని బురిడీ కొట్టించి రూ.180 కోట్లు గ్యాంబ్లింగ్‌.. అసలేం జరిగిందంటే..

మరోవైపు ఎస్‌యూ7 మ్యాక్స్‌ 2.78 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఒక్క ఛార్జింగ్‌తో 800 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని గరిష్ఠ వేగం 265 కి.మీ/గం. 838 ఎన్‌ఎం టార్క్‌ వద్ద 673 పీఎస్‌ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కార్ల ధరలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)