Breaking News

టోకు ధరలు దిగివచ్చాయ్‌..!

Published on Thu, 06/15/2023 - 05:05

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మే నెల్లో పెరుగుదల లేకపోగా 3.48 శాతం (క్షీణత) తగ్గింది. గడచిన ఏడు సంవత్సరాల్లో (2015 నవంబర్‌లో మైనస్‌ 3.7 శాతం) ఈ స్థాయిలో టోకు ధరలు నమోదుకావడం ఇదే తొలిసారి. హైబేస్‌ ఎఫెక్ట్‌తోపాటు (గత ఏడాది మే నెల్లో భారీ టోకు ద్రవ్యోల్బణం నమోదుకావడం) సూచీలో మూడు ప్రధాన విభాగాలైన– ఆహార, తయారీ, ఇంధన ధరలు పూర్తిగా అదుపులోనికి వచ్చాయి.

2022లో మే నెలలో 16.63 శాతం టోకు ద్రవ్యోల్బణం (హై బేస్‌) నమోదుకావడం ఇక్కడ గమనార్హం.  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం మేనెల్లో 25 నెలల కనిష్టం 4.25 శాతంగా నమోదయిన సానుకూల ఫలితం నేపథ్యంలోనే టోకు ధరలకు సంబంధించి కూడా ఎకానమీకి ఊరటనిచ్చే తాజా ఫలితం వెలువడింది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా గణాంకాలను పరిశీలిస్తే...

► ఏప్రిల్‌లో ఫుడ్‌ ఆర్టికల్స్‌ ధరల 3.54 శాతం తగ్గితే (వార్షికంగా పోల్చి) తాజా సమీక్షా నెల్లో తగ్గుదల 1.51 శాతంగా ఉంది. కూరగాయల ధరలు 20.12 శాతం తగ్గాయి. ఆలూ ధరలు 18.71%, ఉల్లిధరలు 7.25% తగ్గాయి. అయితే పప్పు దినుసుల ధరలు మాత్రం 5.76 % ఎగశాయి. గోధుమలకు సంబంధించి ద్రవ్యోల్బణం కూడా 6.15%గా ఉంది.  
► ఇంధనం, విద్యుత్‌ బాస్కెట్‌ ద్రవ్యోల్బణం మేలో 9.17 శాతం (మైనస్‌) తగ్గింది. ఏప్రిల్‌ నెలలో 0.93 శాతంగా ఉంది.  
► తయారీ ఉత్పత్తుల ధరలు ఏప్రిల్‌లో మైనస్‌ 2.42 శాతంగా ఉంటే, మేలో మైనస్‌ 2.97 శాతంగా నమోదయ్యింది.

 
ప్రతి ద్రవ్యోల్బణం... వరుసగా రెండో నెల
ద్రవ్యోల్బణం మైనస్‌ లోకి వెళ్లడాన్ని... సాంకేతికంగా ప్రతి ద్రవ్యోల్బణం అని పిలుస్తారు. ఈ ప్రాతిపదికన ప్రతి ద్రవ్యోల్బణం నమోదుకావడం వరుసగా ఇది రెండవనెల. ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణం మైనస్‌ 1.51%గా నమోదయ్యింది. రానున్న నెలల్లో కూడా ఇదే ధోరణి కొనసాగితే, బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో 2023లో యథాతథంగా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనావేస్తున్నారు. 2022 మే తర్వాత 2.50% పెరుగుదలతో 6.5 శాతానికి చేరిన రెపో రేటును గత రెండు ద్వైమాసిక సమీక్షల సందర్భంగా ఆర్‌బీఐ యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం అదుపులోనికి రావడమే దీనికి కారణం.  
 

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)