రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పీఎస్ పరిధిలో కారు బీభత్సం
Breaking News
ఈ ఒక్క కంపెనీ అప్పు.. భారత్ జీడీపీ కంటే ఎక్కువ!
Published on Wed, 12/10/2025 - 08:26
ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ రుణం పెరుగుతూ వస్తోంది. విస్తరణ, రీఫైనాన్స్ లేదా పెట్టుబడి అవసరాల కోసం కంపెనీలు రుణాన్ని ఉపయోగిస్తున్నప్పటికీ, ఆదాయం తగ్గినప్పుడు ఈ రుణాలు భారీ భారంగా మారుతాయి. కొన్నిసార్లు సంస్థలు నిలదొక్కుకోవడానికి ఆస్తుల అమ్మకం లేదా విభాగాల మూసివేతల వరకు వెళ్తాయి.
ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ రుణాన్ని పరిశీలిస్తే కళ్లు చెదిరే అంకెలు బయటపడుతున్నాయి. అత్యధిక రుణభారంతో ఉన్న టాప్ 10 కంపెనీలలో ఐదు చైనా, మూడు అమెరికా, ఒకటి ఫ్రాన్స్, ఒకటి కెనడా దేశాలకు చెందినవి. అమెరికా తన హౌసింగ్ ఫైనాన్స్ దిగ్గజాలతో ఈ జాబితాలో ఆధిపత్యం చెలాయిస్తోంది.
ప్రపంచంలోనే అత్యంత రుణం ఈ కంపెనీదే..
అమెరికన్ మార్టగేజ్ సంస్థ ‘ఫెన్నీ మే’ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ రుణం ఉన్న కంపెనీగా నిలిచింది. దీని రుణ భారం 4.21 ట్రిలియన్ డాలర్లు. ఇది భారతదేశ జీడీపీ కంటే అధికం. అంతేకాదు.. యూకే, ఫ్రాన్స్, బ్రెజిల్, ఇటలీ, కెనడా వంటి దేశాల జీడీపీకన్నా కూడా ఎక్కువ.
అప్పుల్లో టాప్ 10 కంపెనీలు
| ర్యాంక్ | కంపనీ | దేశం | మొత్తం రుణం |
|---|---|---|---|
| 1 | ఫెన్నీ మే | అమెరికా | $4.21 ట్రిలియన్ |
| 2 | ఫ్రెడ్డీ మాక్ | అమెరికా | $3.349 ట్రిలియన్ |
| 3 | జేపీ మోర్గాన్ చేజ్ | అమెరికా | $496.55 బిలియన్ |
| 4 | అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా | చైనా | $494.86 బిలియన్ |
| 5 | చైనా కన్స్ట్రక్షన్ బ్యాంక్ | చైనా | $479.33 బిలియన్ |
| 6 | బిఎన్పి పరిబాస్ | ఫ్రాన్స్ | $473.67 బిలియన్ |
| 7 | ఐసిబిసి | చైనా | $445.05 బిలియన్ |
| 8 | బ్యాంక్ ఆఫ్ చైనా | చైనా | $400.70 బిలియన్ |
| 9 | సిటిక్ లిమిటెడ్ | చైనా | $386.79 బిలియన్ |
| 10 | రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా | కెనడా | $377.70 బిలియన్ |
భారత్‌లో అంబానీ కంపెనీ టాప్
భారతదేశంలో ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధిక రుణభారం ఉన్న సంస్థ. దీని మొత్తం రుణం 43.24 బిలియన్ డాలర్లు. అంటే సుమారు రూ.3.8 లక్షల కోట్లు. ఇది భారత కార్పొరేట్ రంగం చేపడుతున్న భారీ పెట్టుబడి ప్రణాళికలు, వృద్ధి లక్ష్యాలను ప్రతిబింబిస్తుంది.
కార్పొరేట్ రుణం అవకాశమా.. సవాలా?
కార్పొరేట్ రుణం విస్తరణకు ఉపయోగపడినా, సరైన నిర్వహణ లేకపోతే ఇది భారీ ఆర్థిక సవాలుగా మారుతుంది. ప్రపంచంలోని అత్యంత రుణపడి ఉన్న కంపెనీలు, అధిక రుణభారం ఎంత ప్రమాదకరమో గుర్తు చేస్తున్నాయి.
Tags : 1