Breaking News

వేల సంవత్సరాలు పనిచేసే డైమండ్ బ్యాటరీ ఇదే..

Published on Fri, 12/06/2024 - 15:48

ఒక బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేస్తే ఎంత సమయం వస్తుంది? మహా అయితే ఒక రోజు.. నెల లేదా సంవత్సరం అనుకుందాం. మనం ఇప్పుడు చెప్పుకోబోయే బ్యాటరీ అయితే వేల సంవత్సరాలు పాటు పనిచేస్తుంది. ఇంతకీ ఆ బ్యాటరీ పేరు ఏంటి? ఎవరు రూపొందించారు? అనే ఆసక్తికర విషయాలు ఈ కథనంలో చూసేద్దాం.

రెండు బ్రిటీష్ సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు.. ఇంజనీర్ల బృందం ఒక అద్భుతమైన బ్యాటరీని రూపొందించింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి 'కార్బన్-14 డైమండ్ బ్యాటరీ'. ఇది వేల సంవత్సరాల పాటు తక్కువ మొత్తంలో శక్తిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

బ్యాటరీ శక్తిని ఉత్పత్తి చేయడానికి.. డైమండ్‌లో నిక్షిప్తం చేసిన కార్బన్-14ని ఉపయోగిస్తుందని బ్రిస్టల్ యూనివర్సిటీ పేర్కొంది. కార్బన్-14 ఎలక్ట్రాన్‌లను విడుదల చేస్తుంది. అయితే ఇది విద్యుత్తును తయారు చేయడానికి ఫోటాన్‌లకు బదులుగా.. ఐసోటోప్ ద్వారా విడుదలయ్యే ఎలక్ట్రాన్‌లను ఉపయోగిస్తుంది.

కార్బన్-14 జీవితకాలం 5,700 సంవత్సరాల కంటే ఎక్కువ. బహుశా ఇన్ని సంవత్సరాలు మనగలిగే బ్యాటరీ ఇప్పటి వరకు ఎక్కడా లేదు. ఈ కార్బన్ 14 బ్యాటరీని అంతరిక్ష పరిశోధనలలోని ప్లానెటరీ రోవర్‌లకు శక్తినివ్వడానికి, నీటి అడుగున ఏర్పాటు చేసే సెన్సార్‌లలో, పేస్‌మేకర్‌లకు శక్తినివ్వడానికి, ఇంప్లాంట్ చేయదగిన వైద్య పరికరాలలో ఉపయోగించవచ్చు. అంటే ఎక్కువ రోజులు ఉపయోగించే పరికరాలలో ఈ బ్యాటరీలను ఉపయోగించుకోవచ్చు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)