Breaking News

భారత వృద్ధి రేటుకు కోత 

Published on Thu, 04/24/2025 - 05:51

న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) తగ్గిస్తున్నట్టు ప్రపంచబ్యాంక్‌ ప్రకటించింది. 6.7 శాతం వృద్ధి నమోదు కావచ్చన్న గత అంచనాలను 6.3 శాతానికి తగ్గించింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక బలహీనత, విధానపరమైన అనిశి్చతుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 

‘‘2024–25లో భారత వృద్ధి రేటు నిరాశపరిచింది. ప్రైవేటు పెట్టుబడులు, ప్రభుత్వ మూలధన వ్యయాలు అంచనాలకు అనుగుణంగా లేకపోవడం ఇందుకు దారితీసింది. భారత జీడీపీ వృద్ధి 2024–25లో ఉన్న (అంచనా) 6.5 శాతం స్థాయి నుంచి 2025–26లో 6.3 శాతానికి నిదానించొచ్చు. 

ప్రైవేటు పెట్టుబడులు, ద్రవ్యపరమైన సడలింపులు, నియంత్రణ పరమైన సానుకూలతలను.. అంతర్జాతీయంగా నెలకొన్న బలహీనత, విధానపరమైన (వాణిజ్యం) అనిశి్చ తులు తటస్థం చేయొచ్చు’’అని ప్రపంచ బ్యాంక్‌ తన నివేదికలో వివరించింది. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) సైతం భారత జీడీపీ అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గతంలో వేసిన 6.5% నుంచి 6.2 శాతానికి తగ్గించడం గమనార్హం. 

‘‘పన్ను తగ్గింపులతో ప్రైవేటు వినియోగం పుంజుకోవచ్చు. ప్రభుత్వ మూలధన వ్యయాలు కూడా పెరుగుతాయి. కానీ, అంతర్జాతీయంగా వృద్ధి నిదానించడం, వాణిజ్య విధానాల్లో మార్పులతో ఎగుమతుల డిమాండ్‌ తగ్గుతుంది’’అని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక తెలిపింది. మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అనిశ్చితి దక్షిణాసియా వృద్ధి అవకాశాలను బలహీనపరుస్తుందని పేర్కొంది. 2025లో దక్షిణాసియా ప్రాంతంలో 6.1 శాతం వృద్ధి నమోదవుతుందన్న గత అంచనాలను 5.8 శాతానికి కుదించింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)