Breaking News

ఫ్లెక్సిబుల్‌ ఐటీ ఉద్యోగాల్లో మహిళల జోరు

Published on Tue, 04/14/2026 - 11:45

ఐటీ, ఐటీ ఆధారిత రంగాల(ఐటీఈఎస్‌) రంగంలో కాంట్రాక్ట్, ఫ్లెక్సిబుల్‌ ఉద్యోగాల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగిందని టాలెంట్‌ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ కెరీర్‌ నెట్‌ నివేదిక తెలిపింది. ఆర్థిక సంవత్సరం 2025–26 ముగిసే నాటికి ఇది 40 శాతానికి చేరిందని వెల్లడించింది. ఎఫ్‌వై 2026లో కాంట్రాక్టు ఉద్యోగాల్లో జరిగిన 3,000 నియామకాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు పేర్కొంది. ఎఫ్‌వై22 – ఎఫ్‌వై26 మధ్య మహిళల నియామకాలు 10 శాతం పాయింట్లు పెరిగి ఎఫ్‌వై26లో 40 శాతానికి చేరుకున్నాయని తెలిపింది. గత నాలుగు ఆర్థిక సంవత్సరాల గణాంకాలతో దీనిని పోల్చి ట్రెండ్‌లను విశ్లేషించినట్లు వెల్లడించింది.  

కెరీర్‌నెట్‌ నివేదికలోని ముఖ్యాంశాలు

  • ఫైనాన్స్‌–అకౌంటింగ్‌లో (43%) విభాగంలో మహిళల ప్రాతినిధ్యం అత్యధికంగా ఉంది. డేటా సైన్స్‌ అండ్‌ అనలిటిక్స్‌ (34%), యూఎక్స్, డిజైన్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ (31%), ఐటీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ (29%), ఇంజినీరింగ్‌–సాఫ్ట్‌వేర్, క్యూఏ (27%) రంగాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. కన్సలి్టంగ్‌లో మహిళల ప్రాతినిధ్యం 20 శాతంతో తక్కువగా ఉంది. ఈ విభాగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఇంకా విస్తృత అవకాశాలు ఉన్నాయని నివేదిక సూచించింది.

  • మహిళల భాగస్వామ్యం మెట్రో నగరాల్లోనే అధికంగా కేంద్రీకృతమై ఉంది. బెంగళూరు (21%), హైదరాబాద్‌ (20%), పుణే (17%) ముందుండగా, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ (13%), చెన్నై (9%) తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ముంబై (7%), కోల్‌కతా (2 శాతం) చివరి స్థానాలతో సరిపెట్టుకున్నాయి. టైర్‌–2 నగరాల్లో మహిళల భాగస్వామ్యం 11 శాతంగా మాత్రమే ఉన్నట్లు నివేదిక తెలిపింది.

  • కెరీర్‌ వ్యవధి పరంగా చూస్తే.., మహిళల భాగస్వామ్యం ‘ప్రారంభ, మధ్య దశ’ల్లో గణనీయంగా ఉంది. రెండేళ్లలోపు అనుభవం ఉన్న ‘ప్రారంభ దశ’ ఉద్యోగుల్లో మహిళల వాటా 30%గా ఉంది. 5 నుంచి 8 ఏళ్ల  అనుభవం ఉన్న ‘మధ్య దశ’లో అది 31% గా నమోదైంది. సీనియర్‌ స్థాయిల్లో మహిళల భాగస్వామ్యం తగ్గుతోంది. 9–14 సంవత్సరాల అనుభవం ఉన్నవారి వాటా 13 శాతంగా, 14 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్నవారి వాటా కేవలం 4 శాతంగా నమోదైంది. ఇది మహిళలను ఉద్యోగాల్లో నిలుపుదల (రిటెన్షన్‌) చేయడం, ఉన్నత స్థాయిలకు ఎదగడంలో (అడ్వాన్స్‌మెంట్‌) ఇంకా లోటుపాట్లు ఉన్నాయని నివేదిక సూచిస్తోంది.

‘‘గత ఐదేళ్లలో ఐటీ/ఐటీఈఎస్‌ రంగంలో మహిళల భాగస్వామ్యం కేవలం సంఖ్యలకే పరిమితం కాకుండా, వారు ఎంపిక చేసుకుంటున్న ఉద్యోగాల స్వరూపంలో కూడా గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. ఫైనాన్స్‌– అకౌంటింగ్‌ విభాగం ముందంజలో ఉండటం, మహిళలు ఇకపైనా ప్రాధాన్యం లేని పాత్రల్లో మాత్రమే కాకుండా కీలక రంగాల్లోకి అడుగు పెడుతున్నారనే సంకేతాలను సూచిస్తోంది. వ్యాపార ఫలితాలపై నేరుగా ప్రభావం చూపే ప్రధాన విభాగాల వైపు మహిళలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు’’ అని కెరీర్‌ నెట్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ నీలభ్‌ శుక్లా తెలిపారు. 

ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు

Videos

అంబేద్కర్ కు వైఎస్ జగన్ నివాళి

తండ్రి కొడుకులపై కుతకుత లాడిన అచ్చెన్నాయుడు

ఇదెక్కడి ఫ్రెండ్లీ పోలీసింగ్..? ఆత్మహత్య చేసుకున్న శివ కార్తికేయ

దళిత మహిళపై బూతులతో రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రాజు

100 ఏళ్లలో ఎపుడు చూడని ఎండ, ఆ రెండు గంటలు బయటికి రాకండి

నాడు రక్షణ వలయం.. నేడు ప్రైవేటు నిలయం

ఇరాన్ అమెరికా రెండో విడత శాంతి చర్చ

ఊహించని దెబ్బ కొట్టిన బంగారం.. కొనాలనుకునే వారికి బిగ్ షాక్..

బోల్డ్ ఫోటోలు చూడాలంటే డబ్బులే! విష్ణుప్రియపై ఫిర్యాదుల వెల్లువ..?

తాడేపల్లి YSRCP ఆఫీస్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు

Photos

+5

#SRHvsRR మ్యాచ్‌.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)

+5

నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : పుంజుకున్న ఆరెంజ్‌ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)

+5

చీరలో శెట్టి బ్యూటీ.. అందమే అందం (ఫొటోలు)

+5

భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో వైభవ్‌ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

కూకట్‌పల్లిలో హీరో విక్టరీ వెంకటేష్ సందడి (ఫొటోలు)

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)