Breaking News

అప్పుల్లోనూ ఆమెదే పైచేయి

Published on Sun, 03/09/2025 - 07:19

ముంబై: ఇంటి బాధ్యతల్లో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలు.. కుటుంబం, వృత్తిపరమైన అవసరాలకు రుణాలను తీసుకోవడానికీ వెనుకాడడం లేదు. గతేడాది యాక్టివ్‌ రుణ గ్రహీతల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నట్టు క్రెడిట్‌ బ్యూరో సంస్థ ‘క్రిఫ్‌ హైమార్క్‌’ తెలిపింది.

రుణాలు తీసుకోవడమే కాదు, వాటిని సకాలంలో తిరిగి చెల్లించడంలోనూ పురుషులతో పోల్చితే మహిళలే మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు వెల్లడించింది. 2024 డిసెంబర్‌ నాటికి యాక్టివ్‌ మహిళా రుణగ్రహీతలు 10.8 శాతం పెరిగి 8.3 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. అదే సమయంలో పురుష రుణ గ్రహీతల్లో వృద్ధి 6.5 శాతంగానే ఉన్నట్టు వెల్లడించింది. ‘‘రుణాల విషయంలో పురుషుల కంటే స్త్రీలే మెరుగైన ప్రవర్తన చూపిస్తున్నారు. బంగారం రుణాలు మినహా మిగిలిన రుణాల్లో 91 నుంచి 180 రోజుల వరకు చెల్లింపులు నిలిపివేసిన రుణ గ్రహీతల్లో మహిళలు తక్కువగా ఉన్నారు’’అని ఈ నివేదిక తెలిపింది.

గృహ రుణాలు, వ్యాపార రుణాలు, వ్యవసాయం, ట్రాక్టర్ల రుణాలు, ప్రాపర్టీ రుణాలు, విద్యా రుణాల్లో మహిళల తీరు మెరుగ్గా ఉన్నట్టు వెల్లడించింది. వినియోగ రుణాల్లోనూ (కన్జ్యూమర్‌) మగవారి కంటే చెల్లింపుల పరంగా మహిళల ప్రవర్తనే మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. 2024 చివరికి మొత్తం మహిళా రుణ గ్రహీతలు 18 శాతం పెరిగి 36.5 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. రుణాల్లో 35 ఏళ్లలోపు వారు ఎక్కువగా తీసుకుంటున్నారు. మహిళలకు సంబంధించి గృహ రుణాలు, వ్యాపార రుణాలు, ప్రాపర్టీ రుణాలు, ఆటో రుణాలు, క్రెడిట్‌కార్డ్, విద్యా రుణాల్లో మహారాష్ట్ర ముందున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది.  

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)