Breaking News

బ్యాంక్ ఖాతాలు వారివే ఎక్కువ: డేటా విడుదల

Published on Mon, 04/07/2025 - 11:46

న్యూఢిల్లీ: దేశీయంగా బ్యాంక్‌ ఖాతాల్లో మహిళల వాటా 39.2 శాతమని ఒక నివేదికలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గ్రామీణ ప్రాంతాలలో అయితే మరింత అధికంగా 42.2 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది. ‘ఉమన్‌ అండ్‌ మెన్‌ ఇన్‌ ఇండియా 2024: సెలెక్టెడ్‌ ఇండికేటర్స్, డేటా’ పేరుతో గణాంకాలు, పథకాల అమలు శాఖ నివేదిక విడుదల చేసింది.

దీని ప్రకారం మహిళల ఖాతాల ద్వారా మొత్తం బ్యాంక్‌ డిపాజిట్లలో 39.7 శాతం లభిస్తున్నాయి. ఇక కొన్నేళ్లుగా స్టాక్‌ మార్కెట్లో ప్రజల పెట్టుబడులు పెరుగుతున్నాయి. దీంతో డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య బలపడుతూ వస్తోంది. 2021 మార్చి 31లో నమోదైన 33.26 మిలియన్‌ డీమ్యా ట్‌ ఖాతాలు 2024 నవంబర్‌ 30కల్లా 143.02 మిలియన్లకు చేరాయి. వెరసి నాలుగు రెట్లుపైగా ఎగశాయి. వీటిలో పురుషుల ఖాతాలు భారీగా 26.59 మిలియన్ల నుంచి 115.31 మిలియన్లకు జంప్‌చేశాయి. అయితే మహిళల ఖాతాలు సైతం 6.67 మిలియన్ల నుంచి 27.71 మిలియన్లకు ఎగశాయి.

1952లో 17.32 కోట్లుగా నమోదైన మహిళా ఓటర్ల సంఖ్య 2024 కల్లా 97.8 కోట్లకు జంప్‌చేసింది. కనీసం ఒక మహిళా డైరెక్టర్‌గల.. డీపీఐఐటీ గుర్తింపు పొందిన స్టార్టప్‌లలోనూ పురోగతి కనిపిస్తోంది. 2017లో ఈ తరహా స్టార్టప్‌లు 1,943 నమోదుకాగా.. 2024కల్లా 17,405కు ఎగశాయి. వెరసి మహిళా ఎంటర్‌ప్రెన్సూర్స్‌ సంఖ్య బలపడుతోంది.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)