Breaking News

ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టింది: ఎంక్వైరీ కోసం ఫోన్ చేస్తే..

Published on Sun, 02/23/2025 - 07:57

ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటీవల పాట్నాకు చెందిన ఒక మహిళ.. కాల్ చేసి వేలాది రూపాయలు పోగొట్టుకుంది. ఇంతకీ ఇదెలా జరిగిందో తెలుసుకుందాం.

పాట్నాలోని యారాపూర్ నివాసి అయిన ఒక మహిళ.. ఫిబ్రవరి 6న ఆన్‌లైన్‌లో మిక్సర్ మెషీన్‌ను ఆర్డర్ చేసింది. అయితే డెలివరీ ఫిబ్రవరి 12 నాటికి కావాల్సి ఉంది. కానీ డెలివరీ అవ్వలేదు. దీంతో ఆమె కంపెనీని సంప్రదించాలని నిర్ణయించుకుని.. సెర్చ్ ఇంజిన్‌లో కంపెనీ కాంటాక్ట్ నంబర్ కోసం వెతికి, ఒక నెంబర్ సంపాదించింది.

తెలియని నెంబర్‌కు కాల్ చేసి, స్కామర్ల ఉచ్చులో పడింది. ఇంకేముంది.. నిమిషాల్లో రూ. 52,000 పోగొట్టుకుంది. చేసేదేమీ లేక.. ఆ మహిళ పోలీసులను సంప్రదించింది. పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.

ఆన్‌లైన్ మోసాల నుంచి తప్పించుకోవాలంటే?
➤కస్టమర్ కేర్ నెంబర్‌ల కోసం.. ఎల్లప్పుడూ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. మోసగాళ్ళు తరచుగా సెర్చ్ ఇంజన్లలో నకిలీ నంబర్‌లను జాబితా చేస్తారు. కాబట్టి ఆన్‌లైన్‌లో వెతకడం మానుకోవాలి. 
➤తెలియని నెంబర్స్ నుంచి వచ్చిన కాల్స్ పట్ల జాగ్రత్త అవసరం. మోసగాళ్ళు ప్రజలను తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
➤ఎవరైనా మిమ్మల్ని చెల్లింపు వివరాలను లేదా లావాదేవీ వివరాలను చెప్పమని, లింక్‌పై క్లిక్ చేయమని అడిగితే.. అధికారిక మార్గాల ద్వారా కంపెనీతో ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి.
➤మోసపోతున్నట్లు అనుమానం వస్తే.. వెంటనే మీ బ్యాంకును సంప్రదించి సైబర్ పోలీసులకు నివేదించండి.

ఇదీ చదవండి: కొత్త ఐఫోన్ 16ఈ.. ఇలా చేస్తే రూ.4000 డిస్కౌంట్

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)