Breaking News

జాబ్ కోసం సెర్చ్ చేస్తే.. రూ.1.94 లక్షలు పోయాయ్

Published on Sat, 11/16/2024 - 21:10

సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. జాబ్స్ అంటూ, స్టాక్ మార్కెట్స్ అంటూ, బంధువులు అంటూ.. వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తాజాగా జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న మహిళను మోసం చేసి రూ. 1.94 లక్షలు కాజేశారు.

కర్ణాటకలోని ఉడుపికి చెందిన అర్చన అనే మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో పార్ట్‌టైమ్ జాబ్‌ల కోసం వెతుకుతుండగా.. అమెజాన్ జాబ్‌లను ఆఫర్ చేస్తున్నట్లు ఒక ప్రకటన చూసింది. ఇది చూసి ఆ ప్రకటన మీద క్లిక్ చేస్తే.. అది నేరుగా వాట్సాప్ చాట్‌కు తీసుకెళ్లింది. స్కామర్‌లు.. రిక్రూటర్‌లుగా నటిస్తూ, ఆమెకు ఉత్సాహం కలిగించే ఆఫర్‌ను అందించారు.

అధిక మొత్తంలో లాభాలను పొందాలంటే.. చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని స్కామర్లు సూచించారు. ఇది నిజమని నమ్మి.. అక్టోబర్ 18 నుంచి 24 మధ్య సుమారు రూ. 1.94 లక్షలను వివిధ యూపీఐ ఐడీలకు బదిలీ చేసింది. అయితే చివరకు రిటర్న్‌లు రాకపోవడంతో.. మోసపోయామని గ్రహించింది. దీంతో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.

ఇదీ చదవండి: కొత్త స్కామ్.. రూటు మార్చిన కేటుగాళ్లు

స్కామర్లు ప్రజలను మోసం చేయడానికి ఎన్నో ఎత్తులు వేస్తుంటారు. కాబట్టి ప్రజలు ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవానికి ఎప్పుడూ తెలియని నంబర్స్ నుంచి వచ్చే కాల్స్, లింక్స్ లేదా మెసేజ్‌లకు స్పందించకుండా ఉండాలి. అవతలి వ్యక్తి అనుమానంగా అనిపిస్తే తప్పకుండా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి.

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)