Breaking News

పెద్ద మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేయాలంటే..?

Published on Fri, 12/20/2024 - 14:17

బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాలో డబ్బు విత్‌డ్రా చేయాలంటే ఏం చేస్తారు.. ‘సింపుల్‌..ఏటీఎం ద్వారా కావాల్సిన నగదును డ్రా చేస్తాం’ అంటారు కదూ. ఒకవేళ మీ ఖాతాలో రూ.5 లక్షలు ఉన్నాయనుకోండి దాన్ని విత్‌డ్రా చేయాలన్నా ఏటీఎం ద్వారానే చేస్తారా..? ఏటీఎం, చెక్‌బుక్‌, డీడీ ఇలా ప్రతిదానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించింది. ఒకవేళ పెద్దమొత్తంలో డబ్బు విత్‌డ్రా చేయాలంటే ఎన్ని విధానాలు ఉన్నాయో తెలుసుకుందాం.

ఏటీఎం విత్‌డ్రా

ఏటీఎం ద్వారా నగదు విత్‌డ్రా చేయాలంటే మీ కార్డును అనుసరించి రోజుకు రూ.40,000 నుంచి గరిష్ఠంగా రూ.ఒక లక్ష వరకు మాత్రమే సాధ్యం అవుతుంది. కొన్ని ప్రముఖ బ్యాంకుల కార్డులకు సంబంధించి విత్‌డ్రా పరిమితులు కింది విధంగా ఉన్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

క్లాసిక్, మాస్ట్రో డెబిట్ కార్డులు: రోజుకు రూ.40,000.

గ్లోబల్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రోజుకు రూ.40,000.

ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు: రోజుకు రూ.1,00,000.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

ఇంటర్నేషనల్, ఉమెన్స్ అడ్వాంటేజ్, ఎన్ఆర్వో డెబిట్ కార్డులు: రోజుకు రూ.25,000

టైటానియం రాయల్ డెబిట్ కార్డు: రోజుకు రూ.75,000

ప్లాటినం, ఇంపీరియా ప్లాటినం చిప్ డెబిట్ కార్డులు: రోజుకు రూ.1,00,000.

ఐసీఐసీఐ బ్యాంక్

క్లాసిక్ డెబిట్ కార్డు: రోజుకు రూ.40,000

గోల్డ్ డెబిట్ కార్డు: రోజుకు రూ.50,000

ప్లాటినం డెబిట్ కార్డు: రోజుకు రూ.1,00,000

యాక్సిస్ బ్యాంక్

క్లాసిక్ డెబిట్ కార్డు: రోజుకు రూ.40,000

ప్లాటినం డెబిట్ కార్డు: రోజుకు రూ.1,00,000

ఇదీ చదవండి: ‘బంగారం’లాంటి అవకాశం.. తులం ఎంతంటే..

చెక్‌బుక్‌

చెక్ లేదా పాస్‌బుక్ ద్వారా గరిష్ఠంగా రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం బ్యాంకుకు ముందుగా సమాచారం అందించాలి. ఆ సమయంలో ఆధార్, పాన్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, చెక్‌బుక్ లేదా పాస్‌బుక్ వంటి డాక్యుమెంటేషన్ అవసరం కావచ్చు. రూ.2 లక్షలకు మించి నగదు విత్‌డ్రా చేస్తే పాన్ కార్డ్ కాపీ తప్పనిసరి.

డిమాండ్ డ్రాఫ్ట్

పెద్ద మొత్తంలో విత్‌డ్రా చేయాలంటే డిమాండ్ డ్రాఫ్ట్‌లు ఉపయోగించవచ్చు. ఇలా చేసే లావేదేవీలను బ్యాంకులు ట్రాక్‌ చేసేందుకు కొన్ని నియామాలు పాటించాయి.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)