Breaking News

30 నెలలు వెయిట్ చేయించి.. షాకిచ్చిన విప్రో!: మండిపడుతున్న ఫ్రెషర్స్

Published on Thu, 08/29/2024 - 20:16

ఏదైనా కంపెనీలో ఒక ఉద్యోగానికి ఎంపికైతే.. ఒక వారం లేదా ఒక నెలలో జాయినింగ్ ఉంటుంది. అయితే దిగ్గజ ఐటీ సంస్థ 'విప్రో' మాత్రం ఆఫర్ లెటర్ ఇచ్చి.. 30 నెలల తరువాత ఫ్రెషర్లను రిజెక్ట్ చేసింది. దీంతో ఆ కంపెనీపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆఫర్ లెటర్ పొందిన అభ్యర్థులకు కంపెనీ ఓ మెయిల్ పంపించింది. ఇందులో 'మీకు ముందుగా తెలియజేసినట్లు.. ఆన్‌బోర్డింగ్ కోసం ముందస్తు నైపుణ్య శిక్షణను విజయవంతంగా పూర్తి చేయడం తప్పనిసరి'. అర్హత ప్రమాణాలు పూర్తి చేయడంలో ఫ్రెషర్లు విఫలమయ్యారు' అని వెల్లడించింది. ఇన్ని రోజులూ జాయినింగ్ డేట్ పొడిగిస్తూ.. ఆఖరికి ఉద్యోగులను రిజెక్ట్ చేసింది. దీంతో ఉద్యోగులు సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్ల నిరీక్షణకు కంపెనీ ఇలాంటి ఫలితం ఇస్తుందని అస్సలు ఊహించలేదని అన్నారు.

విప్రో మాత్రం ఫ్రెషర్స్ ఆఫర్స్ లెటర్స్ రద్దు చేసిన తరువాత.. క్లయింట్ అవసరాలకు అనుగుణంగా ప్రతి ఉద్యోగి సరైన నైపుణ్యాలను ప్రదర్శించాలని ఆశిస్తున్నామని వెల్లడించింది. కొత్త టెక్నాలజీలో ఉద్యోగులకు తప్పకుండా ప్రావీణ్యం ఉండాలని పేర్కొంది.

ఉద్యోగం వస్తుందని ఎదురు చూసిన ఎంతోమంది ఉద్యోగులకు విప్రో పెద్ద షాక్ ఇచ్చింది. ఓ ప్రముఖ కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏ మాత్రం సమంజసం కాదని పలువురు చెబుతున్నారు. దీనిపైన ఐటీ ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయో త్వరలోనే తెలుస్తుంది.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)