Breaking News

విప్రో లాభం డౌన్‌...

Published on Sat, 01/13/2024 - 00:53

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం దాదాపు 12 శాతం క్షీణించి రూ. 2,694 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 3,053 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 4 శాతం వెనకడుగుతో రూ. 22,205 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 23,229 కోట్ల టర్నోవర్‌ సాధించింది. ఐటీ సర్విసుల విభాగం 4.5 శాతం తక్కువగా రూ. 22,151 కోట్ల ఆదాయం అందుకుంది. 

గైడెన్స్‌ ఇలా 
ఈ ఏడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో ఐటీ సర్విసుల బిజినెస్‌ 261.5–266.9 కోట్ల డాలర్ల(రూ. 21,845–22,296 కోట్లు) మధ్య టర్నోవర్‌ను సాధించే వీలున్నట్లు విప్రో తాజాగా అంచనా వేసింది. వాటాదారులకు ప్రతీ షేరుకీ రూ. 1 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది.

ఇతర విశేషాలు 
♦ ఐటీ సర్వీసుల నిర్వహణ లాభం(ఇబిట్‌) త్రైమాసికవారీగా 2 శాతం తగ్గి రూ. 3,540 కోట్లుగా నమోదైంది. 
♦బీఎఫ్‌ఎస్‌ఐ సర్విసుల విభాగం ఆదాయం 12.1% క్షీణించగా.. కన్జూమర్‌ 6.9%, తయారీ 9.1% చొప్పున నీరసించాయి. కమ్యూనికేషన్స్‌ నుంచి మాత్రం 18.8 శాతం జంప్‌చేసింది. 
♦ ఆర్డర్‌ బుక్‌ 0.2 శాతం బలపడి 3.8 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. వీటిలో భారీ డీల్స్‌ విలువ 0.9 బిలియన్‌ డాలర్లు. 
♦ ఉద్యోగ వలసల(అట్రిషన్‌) రేటు గత 6 క్వార్టర్లకల్లా కనిష్టంగా 14.2 శాతంగా నమోదైంది. 
♦ డిసెంబర్‌కల్లా 4,473 మంది ఉద్యోగులు తగ్గారు. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,40,234గా నమోదైంది.

ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 465 వద్ద ముగిసింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)