Breaking News

ఐటీ ఉద్యోగార్థులకు విప్రో గుడ్‌న్యూస్‌

Published on Sat, 08/31/2024 - 11:59

ప్రముఖ ఐటీ సంస్థ విప్రో ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. 2025 ఆర్థిక సంవత్సరంలో సుమారు 12 వేల మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. గతంలో ఆఫర్‌ లెటర్స్‌ అందుకున్న ఫ్రెషర్లకు తమ ప్రాధాన్యత ఉంటుందని, ఇప్పటికే మొదటి త్రైమాసికంలో దాదాపు 3 వేల మంది న్యూ ఏజ్‌ అసోసియేట్స్‌ (ఫ్రెషర్స్‌)ని ఆన్‌బోర్డ్‌ చేశామని పేర్కొంది.

టెక్‌ పరిశ్రమలో ఓ వైపు ఉద్యోగాల కోతలు కొనసాగుతుండగా విప్రో నుంచి నియామకాలపై ప్రకటన రావడంతో ఉద్యోగార్థుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. "గతంలో జాబ్‌ ఆఫర్లు పొందిన ఎన్‌జీఏలను (ఫ్రెషర్స్‌) ఆన్‌బోర్డ్ చేయడం మా మొదటి ప్రాధాన్యత . 2025 ఆర్థిక సంవత్సరం క్యూ1లో సుమారు 3,000 ఎన్‌జీఏలను ఆన్‌బోర్డ్ చేశాం" అని విప్రో పీటీఐకి ఒక ప్రకటనలో తెలిపింది.

విప్రో 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 10,000-12,000 ఫ్రెషర్లను తీసుకుంటుంది. జెన్‌-ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ విభాగాల్లో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. "భవిష్యత్ అవసరాలను తీర్చడానికి బలమైన పైప్‌లైన్‌ను అభివృద్ధి చేసుకోవడంలో భాగంగా క్యాంపస్ నియామకాల వ్యూహాలను కొనసాగిస్తాం. భాగస్వామ్య విద్యా సంస్థలతో అనుసంధానం కొనసాగుతుంది" అని పేర్కొంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)