Breaking News

విప్రోకు భారీ కాంట్రాక్ట్‌.. వేల కోట్ల అమెరికన్‌ డీల్‌

Published on Thu, 06/06/2024 - 18:24

ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ ఆర్థిక అనిశ్చితితో ఇబ్బందులను ఎదుర్కొంటున్న వేళ భారత్‌ ఐటీ దిగ్గజం విప్రో భారీ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ప్రముఖ అమెరికా కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఐదేళ్ల కాలానికి 500 మిలియన్ డాలర్ల ( సుమారు రూ. 4,175 కోట్లు ) డీల్ పొందినట్లు కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఫైలింగ్ లో తెలిపింది.

ఈ ఒప్పందంలో భాగంగా అమెరికన్‌ సంస్థకు కొన్ని ఉత్పత్తులు, పరిశ్రమకు సంబంధించిన పరిష్కారాల కోసం నిర్వహణ సేవలను అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను విప్రో వెల్లడించలేదు.

కాగా విప్రో కమ్యూనికేషన్ విభాగం 2024 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ప్రాతిపదికన 14.7 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయంలో 4.2 శాతం ఈ విభాగం నుంచి కంపెనీ లభిం​చింది.  500 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు అగ్రశ్రేణి ఐటీ సేవల సంస్థలకు కీలకం. ఎందుకంటే అవి నేరుగా ఆదాయ వృద్ధిని ప్రభావితం చేస్తాయి.

నాలుగో త్రైమాసికంలో విప్రో భారీ డీల్ బుకింగ్స్ 9.5 శాతం పెరిగి 1.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వృద్ధిని వేగవంతం చేయడమే విప్రో తక్షణ ప్రాధాన్యత అని కొత్తగా నియమితులైన సీఈవో శ్రీనివాస్ పలియా గత ఎర్నింగ్స్‌ కాల్ లో చెప్పారు.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)