Breaking News

ప్రయాణాలకు శీతాకాలమే ఇష్టం: సర్వేలో వెల్లడైన విషయాలు

Published on Fri, 12/12/2025 - 19:52

విహారయాత్రలంటే ఎవరికి మాత్రమే ఇష్టం ఉండదు చెప్పండి, ఏడాదిలో ఏదో ఒకసారైనా.. ఒంటరిగా లేదా కుటుంబంతో అయినా.. అలా కొత్త ప్రదేశాలను సందర్శించి సంతోషపడుతుంటారు. టూర్ వెళ్లడానికి కొందరు వేసవి కాలం ఎంచుకుంటే, మరికొందరు శీతాకాలం ఎంచుకుంటారు. అయితే.. చాలామంది శీతాకాల ప్రయాణమే ఎంచుకుంటారని ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) ఒక సర్వేలో వెల్లడించింది.

భారతదేశంలో చాలామంది ప్రయాణికులు కొత్త ప్రదేశాలను సందర్శించడానికి లేదా విహారయాత్రలకు వెళ్లడానికి శీతాకాలాన్ని ఎంచుకుంటున్నారని ఎయిర్‌బీఎన్‌బీ 2025 వింటర్ ట్రావెల్ ట్రెండ్స్ సర్వే ద్వారా స్పష్టం చేసింది. చల్లని వాతావరణం.. అందమైన ప్రదేశాలను అన్వేషించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి చాలా బాగుంటుందని.. ఈ కారణంగానే ఈ కాలంలో ప్రయాణాలకు షెడ్యూల్‌ చేసుకుంటున్నారని వెల్లడించింది.

భారతీయులలో 30 శాతం మంది శీతాకాలంలో సెలవులను ఎంజాయ్ చేయడానికి ఎంచుకుంటుంటే.. మరో 30 శాతం మంది విశ్రాంతి తీసుకోవడానికి ప్రయాణాలు చేస్తున్నారు. 20 శాతం మంది కాలానుగుణ లేదా సాంస్కృతిక అనుభవాలను కనుగొనడానికి ప్రయాణం చేస్తున్నారని సర్వేలో ఎయిర్‌బీఎన్‌బీ చెప్పుకొచ్చింది.

50 శాతం మంది ప్రజలు జీవిత భాగస్వామితో ప్రయాణించడానికి ఇష్టపడతారు. మూడవ వంతు స్నేహితులతో, 30 శాతం మంది ఉమ్మడి కుటుంబాలతో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారని సర్వేలో ఎయిర్‌బీఎన్‌బీ వెల్లడించింది. ఇందులో కూడా చాలామంది ముందుగా గోవా, కేరళకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ తరువాత జాబితాలో తిరువనంతపురం, కొచ్చి వంటి ప్రదేశాలలోని బీచ్‌లు, కేఫ్‌లు, తీరప్రాంతాలు ఉన్నాయి. 2025 అక్టోబర్ 13-20 మధ్య దేశవ్యాప్తంగా 2,155 మందితో సర్వే నిర్వహించి 2025 వింటర్ ట్రావెల్ ట్రెండ్స్ నివేదిక విడుదల చేసింది.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)