Breaking News

బ్లాక్ కలర్ సాక్స్.. విమానంలో ప్రమాదమా?

Published on Tue, 06/16/2026 - 21:05

విమాన ప్రయాణం చేసే సమయంలో.. దాదాపు అందరూ సౌకర్యవంతమైన దుస్తులు, సులభంగా తొలగించడానికి వీలయ్యే షూస్, చలిని తట్టుకునేందుకు జాకెట్లు లేదా హుడీలు ధరించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే చాలామంది గమనించని ఒక చిన్న విషయం ఏమిటంటే? సాక్స్ రంగు. ముఖ్యంగా బ్లాక్ కలర్ సాక్స్ ధరించడం విమాన ప్రయాణంలో కొన్ని అనుకోని సమస్యలకు కారణమవుతుందని విమాన సిబ్బంది చెబుతున్నారు. దీనికి గల కారణాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

విమానాల్లో.. ముఖ్యంగా రాత్రి ప్రయాణాల సమయంలో, క్యాబిన్ లైటింగ్ సాధారణంగా తక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిలో నల్ల రంగు సాక్స్ విమానంలోని పరిసరాలతో (కింది భాగం) కలిసిపోతాయి. ప్రయాణికులు షూస్ తీసేసి కాళ్లను ముందుకు చాచినప్పుడు లేదా నడిచే మార్గంలో ఉంచినప్పుడు, అవి సిబ్బందికి లేదా ఇతర ప్రయాణికులకు సులభంగా కనిపించకపోవచ్చు.

విమానాల్లో నడిచే మార్గాలు చాలా ఇరుకుగా ఉంటాయి. క్యాబిన్ సిబ్బంది ఆహారం, పానీయాలు లేదా ఇతర సర్వీసులను అందించేందుకు తరచుగా ఆ మార్గాల్లో తిరుగుతూ ఉంటారు. ఈ సమయంలో కాళ్లు స్పష్టంగా కనిపించకపోతే సిబ్బంది వాటిని తొక్కే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు సర్వీస్ ట్రాలీలు కూడా కాళ్లను ఢీకొట్టే ప్రమాదం ఉంది. అందువల్ల ఇది చిన్న విషయం లాగా కనిపించినప్పటికీ భద్రత పరంగా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది.

ఇంకో ముఖ్యమైన అంశం పరిశుభ్రత. విమానాల నేలపై వివిధ రకాల సూక్ష్మక్రిములు, వైరస్‌లు కొంతకాలం జీవించి ఉంటాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి షూస్ తీసేసి కేవలం సాక్స్‌తోనే నేలపై నడవడం ఆరోగ్యపరమైన ప్రమాదాలను కూడా పెంచే అవకాశం ఉంటుంది.

ఈ నేపథ్యంలో.. నిపుణులు లేత రంగుల సాక్స్ ధరించడం మంచిదని సూచిస్తున్నారు. తెలుపు, బూడిద లేదా ఇతర లేత రంగుల సాక్స్ తక్కువ వెలుతురులో కూడా సులభంగా కనిపిస్తాయి. దీంతో సిబ్బంది, ఇతర ప్రయాణికులు వాటిని గుర్తించి ప్రమాదాలను నివారించగలరు.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు