Breaking News

‘డీఓజే ప్రతిపాదనలు పూర్తి ప్రతికూలం’

Published on Fri, 05/02/2025 - 12:30

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అమెరికా న్యాయ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (డీఓజే) ప్రతిపాదించిన యాంటీట్రస్ట్ పరిష్కారాలపై ఆందోళన వ్యక్తం చేశారు. అవి గూగుల్ సెర్చ్‌కు పూర్తి ప్రతికూలంగా ఉంటున్నాయని తెలిపారు. యూఎస్‌ డీఓజే ప్రాతిపాదనలు ‘దీర్ఘకాలికంగా అసాధారణమైనవి’గా ఉన్నాయని చెప్పారు. ఈ ప్రణాళికలు సెర్చ్ ఇంజిన్ నిర్మాణానికి సవాలుగా మారుతాయని పేర్కొన్నారు.

సుందర్‌ లేవనెత్తిన కీలక ఆందోళనలు

డీఓజే ప్రతిపాదనలో భాగంగా గూగుల్ తన సెర్చ్‌ ఇండెక్స్‌, టెక్నాలజీతో సమకూరిన మార్జినల్‌ కాస్ట్‌ను పోటీదారులతో పంచుకోవాల్సి ఉంటుంది. ఇది గూగుల్ పోటీ ప్రయోజనాన్ని నాశనం చేస్తుందని, ఆవిష్కరణలను అణిచివేస్తుందని పిచాయ్ వాదించారు. ప్రభుత్వ ప్రణాళిక దీర్ఘకాలికంగా అసాధారణమైనదని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గూగుల్ గత సంవత్సరం రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌కు 49 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. కంపెనీ టెక్నాలజీ మార్జినల్‌ కాస్ట్‌ను పోటీదారులతో పంచుకోవాల్సి వస్తే ఇలాంటి పెట్టుబడులను ఎలా కొనసాగించాలని పిచాయ్‌ ప్రశ్నించారు.

క్రోమ్‌పై ప్రభావం

క్రోమ్ సెక్యూరిటీ, అభివృద్ధిలో గూగుల్ గణనీయమైన పెట్టుబడి పెట్టినట్లు సుందర్ తెలిపారు. క్రోమ్ బ్రౌజర్‌ను బలవంతంగా విక్రయించాలనేలా డీఓజే పరిశీలిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. యాపిల్ ఇంటెలిజెన్స్‌లో జెమినీ ఏఐని చేర్చడానికి గూగుల్ సంప్రదింపులు జరుపుతోందని, ఇది నాన్ ఎక్స్‌క్లూజివ్‌ డీల్స్ వైపు మార్పును ప్రతిబింబిస్తుందని చెప్పారు.

ఇదీ చదవండి: దేశంలో వెపన్స్‌ తయారీ పెంపు

ఆగస్టులో తుది తీర్పు

2025 ఆగస్టులో ఈమేరకు పరిష్కార మార్గాలపై తీర్పు వెలువడే అవకాశం ఉంది. గూగుల్ ఇప్పటికే యాంటీట్రస్ట్ తీర్పుపై అప్పీల్ చేయాలని యోచిస్తోంది. డేటా సేకరణ, సాంకేతికతలో అన్యాయమైన ప్రయోజనం ద్వారా గూగుల్ సెర్చ్‌ గుత్తాధిపత్యం చెలాయిస్తోందని, దాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వ జోక్యం అవసరమని డీఓజే వాదిస్తుంది.

Videos

అక్క స్కెచ్ అదిరిందిగా! బిగ్ బాస్ లోకి రమానందన వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

ఇది పద్దతి కాదు.. కేటీఆర్ పై స్పీకర్ సీరియస్

వైభవ్..నువ్వు సూపర్ రా! బుడోడిపై ఇషాన్ ప్రశంసలు

అడ్డంగా ఇరుక్కున్నాక లోకేశ్ వాయిస్ లో బేస్ తగ్గింది..

అంతర్జాతీయంగా దుమారం రేపుతున్న ట్రంప్ పోస్ట్

ఇన్వెస్టర్లకు బిగ్ అప్ డేట్.. కొత్త ట్రేడింగ్ రూల్స్ ఇవే!

50 భాషల్లో కళ్ళు చెదిరేలా మహేశ్ బాబు వారణాసి

సాక్షి ఇంపాక్ట్.. ఆ ఇద్దరి సర్టిఫికెట్స్ ఫేక్.. ఖోఖో అసోసియేషన్ సంచలన లేఖ

గంటలో 104 మి. మీ వర్షం.. జపాన్ ను ముంచేసిన వరద

అసలు ఉద్యోగం రావాల్సిందే నాకు.. లాస్ట్ లో వాళ్ళు ఏం చేశారంటే..

Photos

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)