Breaking News

పాదరసంలా పడిపోయిన వెండి.. కారణాలివే..

Published on Sat, 01/31/2026 - 13:58

దేశీయ వెండి ధరలు ఇటీవల వారాల పాటు కొనసాగిన తీవ్ర హెచ్చుతగ్గుల అనంతరం కొంత శాంతించాయి. ఈ నెల ప్రారంభంలో రికార్డు స్థాయిలను తాకిన వెండి ధరలు, ఇప్పుడు ప్రపంచ మార్కెట్ సంకేతాల ప్రభావంతో తగ్గుదల బాట పడుతున్నాయి.

జనవరి నెల వెండికి అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. నెల ప్రారంభం నుంచే ధరలు గణనీయంగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, బలహీనమైన అమెరికన్ డాలర్, సురక్షిత పెట్టుబడిగా లోహాలపై పెరిగిన డిమాండ్ ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.

జనవరి చివరి నాటికి వెండి ధరలు చరిత్రాత్మక గరిష్ఠాలకు చేరాయి. జనవరి 31 నాటికి భారతదేశంలో భౌతిక వెండి కిలోకు సుమారు రూ.3.35 లక్షల వద్ద ట్రేడవగా, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో మార్చి ఫ్యూచర్స్ ధర కిలోకు రూ.3.95 లక్షల వరకు చేరింది. శనివారం (జనవరి 31) ఒక్క రోజే వెండి ధర కేజీకి రూ.55 వేలు పతనమైంది. జనవరి 30న, కామెక్స్ లో వెండి గరిష్ట ధర (ఔన్స్‌కు) 118 డాలర్ల నుండి 37 శాతం తగ్గి 74 డాలర్లకు పడిపోయింది.

ఎందుకీ తగ్గుదల?
వెండి ధరల్లో వచ్చిన భారీ తగ్గుదల వెనుక ప్రధానంగా అంతర్జాతీయ కారణాలే ఉన్నాయి.

  • అమెరికా డాలర్ బలపడటంతో విలువైన లోహాలపై ఆసక్తి తగ్గింది. డాలర్ బలంగా ఉన్నప్పుడు విదేశీ కొనుగోలుదారులకు వెండి మరింత ఖరీదవుతుంది.

  • బంగారం ధరలు పడిపోవడం కూడా వెండిపై ప్రతికూల ప్రభావం చూపింది. బంగారం–వెండి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం కారణంగా వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.

  • అలాగే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్‌గా కెవిన్ వార్ష్‌ను నామినేట్ చేయడంతో మార్కెట్ సెంటిమెంట్‌లో మార్పు వచ్చింది.

ఈ పరిణామాలన్నీ కలసి వెండి ధరలను ఇటీవలి గరిష్ఠాల నుంచి వెనక్కి నెట్టేశాయి.

Videos

అరవ శ్రీధర్‌ మరో రెండు వీడియోలు రిలీజ్

అంబటిపై దాడిని అడ్డుకున్న YSRCP కార్యకర్తపై పోలీసుల దౌర్జన్యం

Vinukonda: పోలీసుల అరాచకం బొల్లా బ్రహ్మనాయుడు తలకు గాయం

సిట్ విచారణకు కేసీఆర్.. నందినగర్ కు రానున్న మాజీ సీఎం

Kannababu : ఇంతమందికి నిద్రలేకుండా చేస్తున్న..

కేంద్ర బడ్జెట్ పైనే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఆశలు

పోలీసులే దగ్గరుండి నాపై దాడి చేయించారు

శబరిమల బంగారం చోరీ కేసులో.. జయరామన్‌ను విచారించిన సిట్

నోరు పడిపోయిందా? MLA శ్రీధర్ ఘటనపై మహిళల స్ట్రాంగ్ రియాక్షన్

అంబటిపై టీడీపీ రౌడీలు ఎటాక్

Photos

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ సక్సెస్ మీట్ లో మెరిసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ సోనమ్ కపూర్ (ఫొటోలు)

+5

'కన్నప్ప' ఫేమ్ ప్రీతి ముకుందన్ గ్లామర్ (ఫొటోలు)

+5

వైభవంగా మేడారం మహా జాతర.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

సందడిగా వింగ్స్‌ ఇండియా..బేగంపేటలో ఆకట్టుకుంటున్న వైమానిక విన్యాసాలు (ఫొటోలు)

+5

నగరంలో సందడి చేసిన మహేష్ బాబు కూతురు సితార (ఫొటోలు)

+5

నారింజలా మెరిసిపోతున్న శోభాశెట్టి (ఫొటోలు)

+5

అనస్వర రాజన్ మూవీ విత్ లవ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

భగవంతుడు మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)