Breaking News

‘తప్పు జరిగింది..క్షమించండి’

Published on Wed, 09/25/2024 - 11:53

సైబర్‌ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్‌స్ట్రైక్‌ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆడమ్ మేయర్స్ యూఎస్‌ ప్రతినిధుల సభ సబ్‌కమిటీ ముందు క్షమాపణలు చెప్పారు. జులై నెలలో ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌ సిస్టమ్స్‌లో కలిగిన అంతరాయం గుర్తుంది కదా. అందుకు సంబంధించి సెక్యూరిటీ సేవలందించిన క్రౌడ్‌స్ట్రైక్‌ సంస్థ ప్రతినిధులు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఈ వ్యవహారం యూఎస్‌ ప్రతినిధుల సభ సబ్‌కమిటీ ముందుకు వచ్చింది. దాంతో క్రౌడ్‌స్ట్రైక్‌ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆడమ్ మేయర్స్ క్షమాపణలు కోరారు.

మేయర్స్ తెలిపిన వివరాల ప్రకారం..‘జులైలో జరిగిన సంఘటనకు సైబర్‌ అటాక్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణం కాదు. కొత్త థ్రెట్ డిటెక్షన్ కాన్ఫిగరేషన్‌లను అప్‌డేట్‌ చేస్తున్నపుడు ఫాల్కన్ సెన్సార్ రూల్స్ ఇంజిన్ తప్పుగా కమ్యూనికేట్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ అప్‌డేట్‌ వల్ల మైక్రోసాఫ్ట్ విండోస్ పరికరాల్లో సెన్సార్‌లు సరిగా పనిచేయలేదు. తిరిగి కాన్ఫిగరేషన్‌లను అప​్‌డేట్‌ చేసేంతవరకు వినియోగదారులు ఈ సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి యూఎస్‌ సైబర్‌సెక్యూరిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సబ్‌కమిటీ ముందు విచారణ జరిగింది. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్త పడుతామని హామీ ఇచ్చాం. జరిగిన తప్పుకు క్షమాపణలు కోరాం’ అని చెప్పారు.

ఇదీ చదవండి: టెలిగ్రామ్‌లో ఇకపై అవి సెర్చ్‌ చేయలేరు!

జులై 19న సంభవించిన ఈ అంతరాయంతో విమానయాన సంస్థలు, బ్యాంకులు, హెల్త్‌కేర్, మీడియా, హాస్పిటాలిటీతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమలు ప్రభావితం చెందాయి. ఇంటర్నెట్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. గ్లోబల్‌గా దాదాపు 85 లక్షల మైక్రోసాఫ్ట్ విండోస్ పరికరాలపై దీని ప్రభావం పడింది. డెల్టా ఎయిర్ లైన్స్ పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేసింది. దానివల్ల 13 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడినట్లు కొన్ని నివేదికలు తెలిపాయి.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)