నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
హెచ్డీఎఫ్సీ బ్యాంకుపై రూ.91 లక్షల జరిమానా.. కారణం..
Published on Sat, 11/29/2025 - 14:26
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్లోని కొన్ని నిబంధనలు, కస్టమర్ గుర్తింపు (కేవైసీ) నియమాలు, ఇతర నియంత్రణ ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఆర్బీఐ హెచ్డీఎఫ్సీ బ్యాంకుపై చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రూ.91 లక్షల జరిమానా విధించింది. ఈమేరకు ఆర్బీఐ ఇటీవల ప్రకటన విడుదల చేసింది.
మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకు ఆర్థిక కార్యకలాపాలపై నిర్వహించిన తనిఖీలో ఈ లోపాలు బయటపడ్డాయని ఆర్బీఐ తెలిపింది. ఒకే రుణ విభాగంలో బహుళ బెంచ్మార్క్ వడ్డీ రేట్లను అనుసరించినట్లు గుర్తించామని పేర్కొంది. ఆర్బీఐ గమనించిన కొన్ని అంశాలు కింది విధంగా ఉన్నాయి.
కస్టమర్ల కేవైసీ ధ్రువీకరణను ఔట్సోర్సింగ్ ఏజెంట్లకు అప్పగించడం.
బ్యాంకు పూర్తి యాజమాన్యంలోని ఒక అనుబంధ సంస్థ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 6 కింద అనుమతి లేని వ్యాపార కార్యకలాపాలు చేపట్టడం.
ఔట్సోర్సింగ్ రిస్క్ మేనేజ్మెంట్ మార్గదర్శకాలు, ప్రవర్తనా నియమావళి (Code of Conduct)లోని కొన్ని నిబంధనలను పాటించకపోవడం.
Tags : 1