Breaking News

పదేళ్ల తర్వాత గూగుల్‌ లోగోలో మార్పులు

Published on Tue, 05/13/2025 - 11:58

గూగుల్‌ దాదాపు దశాబ్ద కాలం తర్వాత తన ఐకానిక్ లోగోలో మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్‌ లోగో ‘జీ’ను కొత్త డిజైన్‌తో పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కొత్త లోగో వెర్షన్‌ను ఆవిష్కరించింది. ఇది ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో బ్లాక్‌లకు బదులుగా ఒకే రంగులో ఫ్లూయిడ్ గ్రేడియంట్ విధానాన్ని అనుసరించింది. 2015 నుంచి ‘జీ’ లోగోను కంపెనీ మార్పు చేయలేదు.

న్యూ లుక్: డిఫరెంట్ ఏంటి?

కొన్నేళ్లుగా ఫ్లాట్‌గా బ్లాక్‌ల్లో రంగులకు బదులుగా ‘జీ’ లోగో ఇప్పుడు నాలుగు రంగులను మిళితం చేసే గ్రేడియంట్‌ను కలిగి ఉంది. ఇది ఐకాన్‌కు మరింత ఆధునికత, డైనమిక్ రూపాన్ని ఇస్తుంది. అన్ని విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకోవాలనే గూగుల్ ఉద్దేశానికి ఇది ఒక చిహ్నంగా పనిచేస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏఐ జనరేటివ్ అసిస్టెంట్ గూగుల్ జెమిని బ్రాండింగ్‌కు అనుగుణంగా ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: పడి లేచిన పసిడి ధరలు! తులం ఎంతంటే..

ఐఓఎస్, పిక్సెల్ యూజర్లకు..

గూగుల్ సెర్చ్ యాప్ ద్వారా ముందుగా ఐఓఎస్, పిక్సెల్‌ యూజర్లకు కొత్త ‘జీ’ లోగో అందుబాటులోకి రానుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. గూగుల్ యాప్ బీటా వెర్షన్ 16.18 ద్వారా కొన్ని ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో కూడా దీన్ని ఉపయోగించనున్నట్లు చెప్పారు. గూగుల్ ఇంకా దీని విడుదల తేదీని తెలియజేయలేదు. అయితే రాబోయే కొన్ని వారాల్లో కొత్త లోగో మరిన్ని డివైజ్‌ల్లో అందుబాటులో ఉంటుందని తెలిసింది. క్రోమ్, మ్యాప్స్, జీమెయిల్, డ్రైవ్ వంటి ఇతర లోగోలను మారుస్తారా.. లేదా యథావిధిగా ఉంచుతారా? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

#

Tags : 1

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)