Breaking News

లక్షల కోట్ల కంపెనీ.. మీటింగ్‌లో ఓ ఖాళీ కుర్చీ: ఎందుకంటే..

Published on Sat, 09/21/2024 - 15:48

1994లో జెఫ్‌ బెజోస్‌ సీటెల్ గ్యారేజీలో స్థాపించిన ఒక చిన్న ఆన్‌లైన్ బుక్ స్టోర్ నేడు ట్రిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. ఆ సంస్థ పేరే 'అమెజాన్'. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగిన అమెజాన్.. సమావేశాల్లో ఎప్పుడూ ఓ కుర్చీ ఖాళీగానే ఉంటుంది. ఇంతకీ మీటింగులో ఖాళీ కుర్చీ ఎందుకు ఉంటుంది. దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

బిలినీయర్ జెఫ్ బెజోస్ నిర్వహించే ప్రతి సమావేశంలోనూ కనిపించే ఖాళీ కుర్చీ కస్టమర్లను గుర్తుకు తెస్తుంది. సమావేశంలో తీసుకునే నిర్ణయాలు కస్టమర్లను దృష్టిలో ఉంచుకునే తీసుకోవడం జరుగుతుంది. కంపెనీ తన మొదటి ప్రాధాన్యతను కస్టమర్లకు ఇస్తున్నట్లు చెప్పడానికే అమెజాన్ కంపెనీ ఆ ఖాళీ కుర్చీని ఉంచుతుంది.

ఇక్కడ తెలుసుకోవలసిన మరో విషయం ఏమిటంటే.. అమెజాన్ కంపెనీ నిర్వహించే సమావేశాల్లో కేవలం ఆరు నుంచి ఎనిమిది మంది సభ్యులు మాత్రమే ఉంటారు. సమావేశంలో ఎక్కువమంది సభ్యులు ఉంటే సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టమని కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండి: 'రిటర్న్ టు ఆఫీస్.. ఇదో పెద్ద ప్లాన్': మాజీ ఉద్యోగి ఫైర్

దిగ్గజ కంపెనీలలో ఒకటిగా ఎదిగిన అమెజాన్ సంస్థలో నిర్వహించే సమావేశాలలో ఇప్పటికి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిషేధమే. సమావేశంలో పాల్గొనేవారు ఖచ్చితంగా తమ ప్రెజెంటేషన్లను పాయింట్ల రూపంలో లేదా మెమోల రూపంలో సమర్పించాల్సిందే. బహుశా ఇలాంటి విధానాన్ని పాటిస్తున్న పెద్ద కంపెనీ అమెజాన్ అనే చెప్పాలి.

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు