Breaking News

డీజిల్‌కు తగ్గిన డిమాండ్‌.. ఎందుకంటే..

Published on Tue, 04/15/2025 - 08:36

పర్యావరణహిత ఇంధనాల వైపు మళ్లే ధోరణి పెరుగుతున్న నేపథ్యంలో గతేడాది (2024–25) డీజిల్‌ డిమాండ్‌ నెమ్మదించింది. డీజిల్‌ వినియోగం 2 శాతమే పెరిగి 91.4 మిలియన్‌ టన్నులకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇది ఏకంగా 12.1%. దేశీయంగా వినియోగించే ఇంధనాల్లో డీజిల్‌ వాటా దాదాపు 40% ఉంటుంది. డీజిల్‌ వినియోగం నెమ్మదించినప్పటికీ దేశీయంగా రవాణా రంగంలో నాలుగింట మూడొంతుల వాటా ఈ ఇంధనానిదే ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కమర్షియల్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మళ్లుతుండటంతో డీజిల్‌ డిమాండ్‌పై ప్రభావం పడుతోందని వివరించాయి. డీజిల్ వినియోగం తగ్గడానికిగల మరిన్ని కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఆర్థిక మందగమనం

అంతర్జాతీయ అనిశ్చితులు, ద్రవ్యోల్బణం కారణంగా ఆర్థిక వృద్ధి క్షీణిస్తుండడం డీజిల్ వినియోగ కార్యకలాపాలతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. ముఖ్యంగా రవాణా, నిర్మాణం, వ్యవసాయం వంటి రంగాల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విభాగాల్లో వృద్ధి నెమ్మదించడంతో డీజిల్‌ వినియోగం పడిపోయింది.

ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పెరుగుదల

పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రభుత్వాలు ఈవీ పాలసీను తీసుకొస్తున్నాయి. దాంతో చాలా మంది వినియోగదారులు సంప్రదాయ శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాల కంటే విద్యుత్‌తో నడిచే వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు, ఆటో రిక్షాలతో సహా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌, బిగ్‌బాస్కెట్‌ వంటి వంటి క్విక్‌కామర్స్‌ కంపెనీలు తమ లాజిస్టిక్స్ ఫ్లీట్లను ఎలక్ట్రిక్ వాహనాలకు మారుస్తున్నాయి.

వినియోగదారుల ప్రాధాన్యతల్లో మార్పు

డీజిల్‌ వాహనాలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన 10 సంవత్సరాల పరిమితితో సహా అనేక భారతీయ నగరాలు డీజిల్ వాహనాలపై కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నాయి. దీంతో వినియోగదారులు పెట్రోల్, సీఎన్‌జీ వాహనాల వైపు మొగ్గుచూపడంతో డీజిల్ అమ్మకాలపై మరింత ప్రభావం పడింది.

ఇదీ చదవండి: కళను దొంగలిస్తున్న ఏఐ

ప్రభుత్వ విధానాలు

భారత ప్రభుత్వం సీఎన్జీ, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహనాలతో సహా స్వచ్ఛమైన ఇంధన ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రిక్ మొబిలిటీకి సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తుండడంతో డీజిల్ వాహనాలపై పెద్దగా ఆసక్తి చూపించడంలేదు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)