Breaking News

తగ్గిన భోజనం ధరలు

Published on Tue, 04/08/2025 - 12:31

వెజిటేరియన్లూ.. మీ భోజనం ఖర్చులు తగ్గాయ్‌! నాన్‌ వెజిటేరియన్లూ.. మీకో శుభవార్త. నాన్‌ వెజ్‌ మీల్స్‌ ఖర్చు కూడా తగ్గింది. క్రిసిల్‌ రేటింగ్‌ సంస్థ ఈమేరకు రిపోర్ట్‌ వెలువరించింది. ఈ ధరల తగ్గింపునకు ప్రధాన కారణం.. వెజిటేరియన్‌ అన్ని వంటల్లో దాదాపుగా వాడే టమాటా ధరలు తగ్గడమేనని నివేదిక తెలిపింది. నాన్‌వెజ్‌ మీల్స్‌ తగ్గింపునకు చికెన్‌ ధరలు దిగిరావడమే కారణమని పేర్కొంది.

క్రిసిల్‌ నివేదికలోని వివరాల ప్రకారం.. మార్చిలో ఇంట్లో వండిన థాలీ ధర వరుసగా ఐదోసారి తగ్గింది. దాంతో ఇది రూ.26.6కు చేరుకుంది. ముఖ్యంగా టమాటా ధరలు తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. మార్చిలో బ్రాయిలర్ చికెన్ ధరలు తగ్గడంతో మాంసాహార థాలీ ధర కూడా రూ.54.8కి చేరింది. శాఖాహార థాలీలో రోటీ, అన్నం, పప్పు, కూరగాయలు..వంటివి ఉంటాయి. ఈ భోజనాన్ని ఇంట్లో తయారు చేయడానికి సగటు ఖర్చు మార్చిలో రూ.26.6కు పడిపోయింది.

ఇదీ చదవండి: త్వరలో ధరలు పెంపు.. యాపిల్‌ స్టోర్ల వద్ద రద్దీ

భోజన ఖర్చులు క్షీణించడం కొన్ని వర్గాల వారికి ఆహార ద్రవ్యోల్బణం విస్తృతంగా తగ్గేలా చేసింది. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటి ఇతర కూరగాయల ధరలు కూడా తగ్గడంతో ఈమేరకు ఉపశమనం కలిగినట్లయింది. ఇంట్లో వండిన భోజనంపై ఆధారపడే కుటుంబాలకు ఇది ఎంతో మేలు కలిగిస్తుంది. నాన్ వెజిటేరియన్ థాలీ ధరలు ప్రధానంగా చికెన్‌పై ఆధారపడి ఉంటాయి. బ్రాయిలర్ చికెన్ ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. మార్చిలో బర్డ్‌ఫ్లూ భయాలు అధికం కావడంతో భారీగా ధరలు తగ్గాయి. ఇది నాన్‌వెజ్‌ థాలీ తగ్గుదలకు కారణమైంది. మధ్యలో చికెన్‌ ధరలు ఒడిదొడుకులకులోనైనా చౌకగా కూరగాయలు లభ్యత ఉండడంతో ఖర్చులను భర్తీ చేసేందుకు తోడ్పడింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)