Breaking News

టర్కీ కంపెనీతో కాంట్రాక్ట్‌ రద్దు

Published on Wed, 05/28/2025 - 09:32

చెన్నై విమానాశ్రయం టర్కీకి చెందిన సెలెబి సంస్థతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అధికారికంగా రద్దు చేసుకుంది. జాతీయ భద్రతా ఆందోళనల కారణంగా కంపెనీ సేవలందిస్తున్న సెక్యూరిటీ క్లియరెన్స్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్ (ఎంఐఏఎల్) సంస్థ సేవలను నిలిపేసింది. దీన్ని సవాలు చేస్తూ కంపెనీ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. విచారణ పూర్తయ్యేవరకు కొత్త గ్రౌండ్ వర్కింగ్‌ కాంట్రాక్టులు ఇవ్వడాన్ని నిలిపివేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో చెన్నై ఎయిర్‌పోర్ట్‌ కూడా సంస్థ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

టర్కిష్ ఏవియేషన్ సంస్థ సెలెబి పదేళ్లకు పైగా భారతదేశంలో కార్యకలాపాలు సాగిస్తోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌తో సహా అనేక విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలను అందిస్తోంది. కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నందుకు ప్రతిస్పందనగా ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు కంపెనీ మధ్యవర్తిత్వ ప్రొసీడింగ్స్ దాఖలు చేసింది.

ఇటీవల కాలంలో టర్కీ పాకిస్థాన్‌ ఉగ్రచర్యలకు మద్దతు ఇస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో టర్మీ సంస్థల కార్యకలాపాలను నిలిపేయాలని దేశీయ సంస్థలు చూస్తున్నాయి. టర్కీ డ్రోన్ల వాడకంతో సహా ప్రాంతీయ సంఘర్షణల్లో పాక్‌కు మద్దతుగా టర్కీ ప్రమేయంపై భారతదేశంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంలో టర్కీ సంస్థలతో ఒప్పందాలపై దేశీయ కంపెనీలు పున:పరిశీలన చేసుకునే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదీ చదవండి: గోల్డ్‌ రేట్‌, స్టాక్‌ మార్కెట్‌ అప్‌డేట్స్‌

సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దును సవాలు చేస్తూ సెలెబి కంపెనీ ఢిల్లీ హైకోర్టు, బాంబే హైకోర్టును ఆశ్రయించింది. జూన్‌లో ఈ కేసు విచారణ జరిగే వరకు ముంబై ఎయిర్‌పోర్ట్‌ కొత్త గ్రౌండ్ హ్యాండ్లింగ్ కాంట్రాక్టులను ఖరారు చేయకుండా బాంబే హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)