Breaking News

డిసెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం అప్‌

Published on Thu, 01/16/2025 - 08:17

టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (WPI) డిసెంబర్‌లో 2.37 శాతానికి చేరింది. ఆహార ఉత్పత్తుల ధరలు నెమ్మదించినప్పటికీ ఆహారేతర ఉత్పత్తులు, ఇంధనం, విద్యుత్‌ మొదలైన వాటి రేట్ల పెరుగుదల ఇందుకు కారణం. 2024 నవంబర్‌లో డబ్ల్యూపీఐ 1.89 శాతంగా ఉండగా.. 2023 డిసెంబర్‌లో 0.86 శాతంగా నమోదైంది. డేటా ప్రకారం ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం(Food Inflation) నవంబర్‌లో 8.63 శాతంగా ఉండగా డిసెంబర్‌లో 8.47 శాతానికి దిగి వచ్చింది. క్రూడాయిల్, కమోడిటీల ధరలు పెరగడం, డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి పరిణామాల వల్ల జనవరిలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 3 శాతానికి పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. గతేడాది జనవరిలో ఇది 0.3%. తాజా ద్రవ్యోల్బణ గణాంకాల నేపథ్యంలో పాలసీ రేట్ల విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ తీసుకోబోయే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

ఇదీ చదవండి: మార్చి తర్వాత వడ్డీరేటు తగ్గింపు!

స్విగ్గీ స్పోర్ట్స్‌కి గ్రీన్‌ సిగ్నల్‌

ఆహార, నిత్యావసరాల డెలివరీ సంస్థ స్విగ్గీకి చెందిన స్విగ్గీ స్పోర్ట్స్‌(Swiggy Sports) ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏర్పాటుకు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ అనుమతులు ఇచ్చింది. ఈ సంస్థ క్రీడలు, అమ్యూజ్‌మెంట్, రిక్రియేషన్‌ కార్యకలాపాలు సాగిస్తుందని స్విగ్గీ తెలిపింది. అలాగే, స్పోర్ట్స్‌ ఈవెంట్ల నిర్వహణ, కెరియర్‌ పరమైన సర్వీసులు అందించడం, ప్రసార హక్కులు కొనుగోలు చేయడం మొదలైనవి కూడా చేపడుతుందని పేర్కొంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)