Breaking News

ఆహార ధరల తీవ్రత

Published on Wed, 05/15/2024 - 04:11

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 1.26 శాతంగా నమోదైంది. గడచిన 13 నెలల్లో ఈ స్థాయి టోకు ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడం దీనికి ప్రధాన కారణం. ఫుడ్‌ ఆరి్టకల్స్‌లో పాటు, విద్యుత్, క్రూడ్‌ పెట్రోలియం, సహజ వాయువు, కొన్ని తయారీ ఉత్పత్తుల ధరలూ పెరిగినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.  ఈ సూచీ వరుసగా రెండు నెలల నుంచి పెరుగుతూ వస్తోంది. ఫిబ్రవరిలో 0.20% ఉన్న డబ్ల్యూపీఐ, మార్చిలో 0.53 శాతానికి ఎగసింది. గత 2023 ఏప్రిల్‌లో సూచీ 0.79 శాతం పెరిగింది.  

అధికారిక గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే..  
⇒ ఫుడ్‌ ఆర్టికల్స్‌ ధరలు మార్చిలో 6.88 శాతం పెరిగితే, ఏప్రిల్‌లో 7.74 శాతం ఎగశాయి. ఇదే కాలంలో కూరగాయల ధరలు 19.52 శాతం నుంచి 23.60 శాతానికి ఎగశాయి. ఆలూ ధరలు 52.96 శాతం నుంచి 71.97 శాతానికి పెరిగాయి. ఇక ఉల్లి ధరలు మార్చిలో 56.99% పెరిగితే, ఏప్రిల్‌లో 59.75 % ఎగశాయి.  

⇒ఫ్యూయల్‌ అండ్‌ పవర్‌ బాస్కెట్‌ విభాగంలో ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 1.38  శాతంగా ఉంది. మార్చిలో ఈ విభాగంలో అసలు పెరుగుదల లేకపోగా మైనస్‌ 0.77 శాతంగా (క్షీణత) నమోదైంది.  
⇒సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం  మాత్రం ఏప్రిల్‌లో పెరక్కపోగా, 0.42 శాతం క్షీణించింది. అయితే మార్చిలో ఈ క్షీణ రేటు 0.85 శాతం ఉండడం గమనార్హం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)