‘నన్ను బలవంతంగా తీసుకెళ్లారు’

Published on Wed, 04/16/2025 - 15:10

పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో ఇరుక్కున్న భారతీయ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీకి సంబంధించిన హై ప్రొఫైల్ వివాదంలో హంగేరి మహిళ బార్బరా జబారికా పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. 2018లో భారత్ నుంచి పారిపోయిన ఛోక్సీని 2021లో జబారికా కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిందని, హనీ ట్రాప్, అపహరణ కుట్రలో బార్బరా కీలకంగా వ్యవహరించిందని ఛోక్సీ తెలిపారు.

చోక్సీ ఆరోపణలు..

హంగేరి మహిళ బార్బరా జబారికా తనను ఫ్రెండ్‌గా పరిచయం చేసుకుందని చెప్పారు. కొంతకాలం తనను నమ్మించి స్నేహం చేసిందని చోక్సీ తెలిపారు. ఒకనొక సమయంలో ఆమె తనను డిన్నర్‌కు ఆహ్వానించిందని, అక్కడ తనను లొంగదీసుకుని బలవంతంగా డొమినికాకు తీసుకెళ్లారని ఆయన ఆరోపించారు. తనను భారత్‌కు రప్పించేందుకు జరుగుతున్న భారీ కుట్రలో ఇది భాగమని ఛోక్సీ తెలిపారు. ఈ ఆరోపణలను బార్బరా తీవ్రంగా ఖండించారు. ఛోక్సీకి వ్యతిరేకంగా జరిగిన కుట్రలో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఛోక్సీ తప్పుడు గుర్తింపుతో తనను పరిచయం చేసుకున్నాడని తెలిపారు. తాను హంగేరిలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం సాగిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: చైనా నడ్డి విరిచేలా అమెరికా కొత్త సుంకాలు

ఇటీవల అరెస్ట్‌

భారత సీబీఐ అధికారుల కోరిక మేరకు ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని ఇటీవల బెల్జియం పోలీసులు అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. రూ.13,500 కోట్ల పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మోసం కేసులో మెహుల్‌పై అభియోగాలున్నాయి. దాంతో అతడిని అప్పగించాలని భారత్‌ కోరింది. ఈ నేపథ్యంలోనే తనను అరెస్ట్‌ చేసినట్టు తెలిసింది. ఛోక్సీని తర్వలోనే భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది. ఛోక్సీ భారత్‌కు రాకుండా ఉండేందుకు గతంలో విశ్వప్రయత్నాలు చేసినట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. ఈమేరకు భారత్‌లోని ఉన్నతాధికారులకు లంచాలు కూడా ఇచ్చినట్లు గతంలో ఆరోపణలున్నాయి.
 

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)