Breaking News

ఫోన్ ఛార్జర్‌కి ఇంత క‌థ ఉందా!

Published on Sat, 02/28/2026 - 14:55

కొన్ని పరికరాలు పని చేయాలంటే కరెంట్‌ అవసరం. మరికొన్ని పరికరాలు పనిచేయాలంటే ఛార్జింగ్‌ అవసరం. ముఖ్యంగా ఫోన్‌ పనిచేయాలంటే ఛార్జింగ్‌ తప్పనిసరి. మరి ఈ ఛార్జర్‌ ఎప్పుడు పుట్టిందో తెలుసా?

ప్రారంభ కాలంలో ఫోన్‌ ఛార్జ్‌ చేయడానికి గంటలకు పైగా పట్టేది. ఇది కూడా 30 నిమిషాలు మాత్రమే నిలిచేది. 1990ల అనంతరం ఫోన్ల వాడకం పెరిగిన తర్వాత నోకియా, మోటరోలా, శామ్‌సంగ్‌ ఫోన్‌ సంస్థలు ప్రత్యేకమైన ఛార్జర్లు తయారు చేశారు. ఒక ఫోన్‌కు వాడే ఛార్జర్‌ మరొక ఫోన్‌కు వాడే అవకాశం లేకుండా చేశారు. దీంతో ఆయా ఫోన్ల కోసం వినియోగదారులు వేర్వేరు ఛార్జర్లు కొనాల్సి వచ్చేది.

ఆ తర్వాత యూఎస్‌బి (యూనివర్సల్‌ సీరియల్‌ బస్‌) ప్రమాణాలకు అనుగుణంగా ఫోన్‌ తయారీ సంస్థలు ఛార్జర్లను తయారు చేయడం మొదలుపెట్టాయి. దీనివల్ల ఛార్జర్లు ప్రామాణికంగా మారాయి. గంటలకొద్దీ ఛార్జింగ్‌ పెట్టే అవసరం లేకుండా తర్వగా ఛార్జింగ్‌ అందేలా ఛార్జర్లను తయారు చేయడం ప్రారంభమైంది. ఛార్జర్‌కు వైర్‌లెస్‌గా తయారు చేయడానికి 2000 సంవత్సరం నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయి.  2010లో తయారు చేయగలిగారు. ప్రస్తుతం మార్కెట్లో వైర్‌లెస్‌ ఛార్జర్లు అందుబాటులో ఉన్నాయి.

చాలామంది ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టి ఫోన్‌ వాడుతుంటారు. దీనివల్ల కరెంట్‌ షాక్‌ కొట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట పడుకునేముందు ఛార్జింగ్‌ పెట్టి ఉదయం దాకా ఉంచడం కూడా సరైన పని కాదంటున్నారు. దీనివల్ల కరెంట్‌ షాక్, అగ్నిప్రమాదాలు జరిగాయని అంటున్నారు. ఫోన్‌లో 100 శాతం ఛార్జింగ్‌ ఎప్పుడూ పెట్టకూడదని, 90 శాతం కంటే తక్కువ ఉంటే సరిపోతుందని అంటున్నారు. 

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు