Breaking News

2030 నాటికి భారత ఎకానమీ రెట్టింపు

Published on Tue, 10/01/2024 - 08:19

భారత ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి రెట్టింపవుతుందని నీతి ఆయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో 2026–27 సమయానికి మూడో అతి పెద్ద ఎకానమీగా ఆవిర్భవించాలన్న లక్ష్యం సాకారం అయ్యేందుకు పటిష్ట వ్యూహాన్ని అమలు చేయాల్సి ఉంటుందన్నారు.

వాతావరణ మార్పులకు సంబంధించి క్లైమేట్‌ టెక్నాలజీలో భారత్‌ అగ్రగామిగా ఎదిగేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని సుబ్రహ్మణ్యం చెప్పారు. పబ్లిక్‌ అఫైర్స్‌ ఫోరం ఆఫ్‌ ఇండియా (పీఏఎఫ్‌ఐ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. భారత్‌ ప్రస్తుతం 3.7 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో అయిదో అతి పెద్ద ఎకానమీగా ఉంది. ప్రకృతి విపత్తులు, పేదరికం వంటి సవాళ్లను అధిగమించడంలో దేశం గత దశాబ్దకాలంగా గణనీయ పురోగతి సాధించిందని,  2047 నాటికి తలసరి ఆదాయం 18,000–20,000 డాలర్ల స్థాయికి పెరుగుతుందని సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆర్థిక వ్యవస్థను పర్యావరణ అనుకూలమైనదిగా తీర్చిదిద్దే దిశగా తీసుకోతగిన చర్యలపై టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు.. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన వివరించారు. గ్లోబలైజేషన్‌ నేపథ్యంలో పురోగమించాలంటే సరఫరా వ్యవస్థను సంస్కరించుకోవాలని సుబ్రహ్మణ్యం చెప్పారు.

ఇదీ చదవండి: యూఎస్‌ వెళ్లేవారికి శుభవార్త! 2.5 లక్షల వీసా స్లాట్లు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)