Breaking News

నిర్మాణం పూర్తయిందా.. బిల్డర్‌ నుంచి తీసుకోవాల్సిన పత్రాలు ఇవే!

Published on Sat, 01/03/2026 - 11:58

బిల్డర్‌ నిర్మాణాన్ని పూర్తి చేయగానే కొనుగోలుదారుల్లో పలు సందేహాలు నెలకొంటాయి. ఎప్పటిలోగా బిల్డర్‌ అపార్ట్‌మెంట్‌ను అప్పగించాలి? అతడి నుంచి ఏయే పత్రాలు తీసుకోవాలి? సంఘం నిర్వర్తించాల్సిన బాధ్యతలేమిటి? వీటిపై అవగాహన పెంచుకుంటేనే బదిలీ ప్రక్రియ ఎంతో సులువుగా జరుగుతుంది.

అపార్ట్‌మెంట్‌ చిన్నదైనా, పెద్దదైనా.. లగ్జరీ ప్రాజెక్ట్‌ అయినా నిర్మాణం పూర్తవగానే ఫ్లాట్లు కొన్నవారంతా కలిసి ఒక సంఘంగా ఏర్పడేందుకు బిల్డర్‌ ప్రతిపాదించాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక సంఘం పేరిట బ్యాంకు ఖాతా తెరవాలి. కొనుగోలు చేసిన వారి నుంచి వసూలు చేసిన కార్పస్‌ ఫండ్‌ మొత్తాన్ని అందులో జమ చేయాలి. నిర్మాణానికి సంబంధించిన కీలకమైన పత్రాలను బిల్డర్‌ నుంచి తప్పకుండా తీసుకోవాలి.

బిల్డర్‌ నుంచి తీసుకోవాల్సిన పత్రాలు ఇవే..
➤బిల్డింగ్‌ ప్లాన్, అప్రూవల్‌ ప్లాన్‌
➤కంప్లీషన్‌ సర్టిఫికెట్‌
➤ఆమోదం పొందిన ఫ్లోర్‌ ప్లాన్లు
➤పొల్యుషన్‌ బోర్డు, విద్యుత్తు, జలమండలి, ఫైర్‌ విభాగాల నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు
➤విద్యుత్, తాగునీరు వంటి కనెక్షన్లు
➤రిజిస్ట్రేషన్‌ పత్రాలు, అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన డ్రాయింగులు
➤కార్పస్‌ఫండ్, అన్ని సౌకర్యాలను సంఘానికి బిల్డర్‌ బదిలీ చేయాలి

ఓసీ తప్పనిసరి..
నగరంలో అపార్ట్‌మెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కూకట్‌పల్లి, నిజాంపేట, మియాపూర్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మదీనాగూడ, తెల్లాపూర్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, కోకాపేట, నార్సింగి వంటి నగరం నలువైపులా అనేక అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. నిర్మాణం పూర్తి కాగానే బిల్డర్‌ స్థానిక సంస్థ(జీహెచ్‌ఎంసీ/హెచ్‌ఎండీఏ) నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌(ఓసీ) తీసుకోవాలి. ఈ ఓసీ వచ్చాక సుమారు రెండేళ్ల వరకు బిల్డర్‌ అపార్ట్‌మెంట్‌ నిర్వహణ బాధ్యత తీసుకోవచ్చు.

సాధారణ శుభ్రత, భద్రత, బిల్లుల చెల్లింపులు, ఆస్తిపన్ను చెల్లింపులు, డీజీ(డీజిల్‌ జెనెరేటర్‌) సెట్ల నిర్వహణ, నివాసితులకు కావాల్సిన ఇతరత్రా పనులపై దృష్టి సారించాల్సి ఉంటుంది. రెండేళ్లయ్యాక నివాసితులంతా కలిసి ఒక సంఘంగా ఏర్పడేందుకు బిల్డర్‌ ప్రతిపాదించాలి. ఫ్లాట్‌ కొన్నప్పుడు.. కొనుగోలుదారులు చెల్లించిన కార్పస్‌ ఫండ్‌ను బ్యాంకులో జమ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్లాన్‌ ప్రకారమే బిల్డర్‌ నిర్మాణం చేపట్టాడని తెలియజేసే నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని స్థానిక సంస్థ నుంచి తీసుకోవాలి. నిర్మాణాన్ని అప్పగించేటప్పుడు బిల్డర్‌ నుంచి కొత్తగా ఏర్పడిన అపార్ట్‌మెంట్‌ సంఘం పలు పత్రాలను తప్పకుండా తీసుకోవాలి.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)