Breaking News

ఐటీఆర్ ఫైలింగ్ ఆలస్యమైతే.. ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు

Published on Sun, 09/14/2025 - 09:28

ఇన్‌కమ్‌ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి గడువు సమీపించింది. ట్యాక్స్ పేయర్స్ 2025 సెప్టెంబర్ 15 లోపల ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ గడువును ఇప్పటికే 2025 జులై 31 నుంచి పొడిగించారు. ఇప్పుడు మళ్లీ పొడిగిస్తారా?, లేదా? అనేదానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదు. గడువు తీరిన తరువాత కూడా ఐటీఆర్ ఫైల్ చేసుకోవచ్చు. కానీ ఫైన్ కట్టాల్సి ఉంటుంది.

గడువు తీరని తరువాత.. డిసెంబర్ 31, 2025 వరకు రూ. 5000 వరకు ఆలస్య రుసుము లేదా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. నికర ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉన్నవారికి జరిమానా గరిష్టంగా రూ. 1000 ఉంటుంది.

ఇక్కడ ఫైన్ ఒక్కటే సమస్య కాదు. కొన్నిసార్లు చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో ప్రాసిక్యూషన్ కూడా ఉండవచ్చు. గత సంవత్సరం.. ఢిల్లీలోని ఒక మహిళ తన ఐటీఆర్ దాఖలు చేయనందుకు ఆమెకు జైలు శిక్ష విధించారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే.. గడువు లోపలే ఐటీఆర్ ఫైల్ చేసుకోవడం ఉత్తమం.

ఐటీఆర్ దాఖలు చేయడంలో ఆలస్యం & ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు
➤ఐటీఆర్ ఫైల్ ఆలస్యమైతే జరిమానాలు చెల్లించడం మాత్రమే కాకుండా.. 234ఏ, 234బీ, 234సీ సెకన్ల కింద పన్ను బకాయి రకాన్ని బట్టి వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆదాయం పన్ను పరిధిలోకి రాకుంటే.. ఫైన్ కట్టాల్సిన అవసరం లేదు.

➤ఐటీఆర్ ఫైలింగ్‌లో ఆలస్యం కారణంగా.. ప్రాసెసింగ్ ఆలస్యం కావొచ్చు. దీంతోపాటు రీఫండ్ కూడా ఆలస్యంగా వస్తుంది.

➤ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల.. మీ రిటర్న్స్‌ను ఇన్‌కమ్‌ ట్యాక్ డిపార్ట్మెంట్ మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం కూడా ఉంది.

➤ఆలస్యంగా అయినా ఐటీఆర్ ఫైల్ చేయడం మిస్సయితే.. ఐటీ శాఖ నేరుగా నోటీసులు పంపించే అవకాశం కూడా ఉంది. అప్పుడు ఐటీఆర్ దాఖలు చేయడకపోవడానికి కారణాన్ని గురించి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు