Breaking News

BMW ఫుల్‌ఫామ్ తెలుసా?.. పేరు వెనుక ఉన్న కథ ఇదే!

Published on Sun, 09/20/2026 - 18:19

ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో బీఎండబ్ల్యూ అనేది చాలామందికి తెలిసిన.. ప్రసిద్ధి చెందిన పేరు. లగ్జరీ కార్లు, బైక్‌లు, అత్యాధునిక ఇంజినీరింగ్‌ వంటి వాటిలో ఈ బ్రాండుకు మంచి గుర్తింపు ఉంది. చాలా మందికి బీఎండబ్ల్యూ లోగో, కార్లు తెలుసు కానీ.. BMW అనే మూడు అక్షరాల అసలు అర్థం ఏమిటి? అనే విషయం మాత్రం చాలామందికి తెలిసి ఉండదు. ఈ పేరు వెనుక జర్మనీకి చెందిన సంస్థ చరిత్ర, ఇంజినీరింగ్ వారసత్వం దాగి ఉంది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

BMW ఫుల్‌ఫామ్
బీఎండబ్ల్యూ పూర్తి పేరు Bayerische Motoren Werke. దీనిని ఇంగ్లిష్‌లో బవేరియన్ మోటార్ వర్క్స్ (Bavarian Motor Works) అని అనువదిస్తారు. ఇందులో Bayerische అంటే జర్మనీలోని బవేరియా ప్రాంతానికి చెందినది, Motoren అంటే ఇంజిన్లు లేదా మోటార్లు, Werke అంటే పరిశ్రమ లేదా కర్మాగారం. అంటే సింపుల్‌గా చెప్పాలంటే.. బవేరియా ప్రాంతంలో ఇంజిన్లను తయారు చేసే సంస్థ అనే అర్థం వస్తుంది.

బీఎండబ్ల్యూ ప్రయాణం ఇలా..
బీఎండబ్ల్యూ అంటే లగ్జరీ కార్లు గుర్తుకొస్తాయి. కానీ ఈ కంపెనీ ప్రయాణం మొదట్లో కార్ల తయారీతో ప్రారంభం కాలేదు. 1916లో జర్మనీలో ప్రారంభమైన బీఎండబ్ల్యూ, తొలినాళ్లలో ప్రధానంగా విమానాల ఇంజిన్ల తయారీపై దృష్టి పెట్టింది. అప్పట్లో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో, నమ్మకమైన ఇంజిన్ల తయారీలో బీఎండబ్ల్యూ కూడా తన వంతు పాత్ర పోషించింది.

పేరులోనే కంపెనీ చరిత్ర!
బీఎండబ్ల్యూకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కంపెనీ పేరు దాని పుట్టుకను, మొదటి వ్యాపారాన్ని ప్రతిబింబిస్తుంది. సంస్థ జర్మనీలోని బవేరియా ప్రాంతంలో ఏర్పడటం వల్లే Bayerische అనే పదం పేరులోకి వచ్చింది. కాలక్రమేణా బీఎండబ్ల్యూ తన వ్యాపారాన్ని విస్తరించి కార్లు, మోటార్‌సైకిళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలను కూడా తయారు చేయడం ప్రారంభించింది. అయినప్పటికీ.. సంస్థకు ప్రారంభం నుంచి ఉన్న “Bayerische Motoren Werke” అనే పేరు అలాగే కొనసాగుతోంది. అందుకే బీఎండబ్ల్యూ పేరు కేవలం ఒక బ్రాండ్ మాత్రమే కాదు.. దాని ఇంజినీరింగ్ మూలాలు, జర్మన్ వారసత్వానికి గుర్తుగా కూడా నిలిచింది.

#

Tags : 1

Videos

నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై

టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు

రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్?

తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు..

గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆరోపణలపై ప్రసన్న ఫైర్

చంద్రబాబుకు బిగ్ షాక్.. తిరుమల లడ్డూపై ఈడీ సంచలన ప్రకటన

పద్థతి మార్చుకో.. MLAపై రెచ్చిపోయిన చంద్రబాబు

నిండా ముంచేసిన లలితా జువెల్లరీ స్టాక్.. అసలేం జరిగిందంటే?

అమలాపురంలో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం

Photos

+5

హాఫ్ శారీలో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫోటోలు)

+5

నాని ది ప్యారడైజ్ స్టైలిష్ లుక్‌.. (ఫోటోలు)

+5

గణేశుడి సన్నిధిలో విజయ్‌ దేవరకొండ..(ఫోటోలు)

+5

అందాల అషు.. (ఫోటోలు)

+5

కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు)

+5

ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు)

+5

గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు)

+5

తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు)