Breaking News

పెట్రోల్‌ పంపులో ఉచిత సదుపాయాలివే..

Published on Fri, 04/11/2025 - 20:23

పెట్రోల్‌ కొట్టించేందుకు వచ్చిన మహిళ పెట్రోల్‌ పంపులో టాయిలెట్‌ కోసం వెళితే తాళం వేసి ఉంది. ఆ రెస్ట్‌రూమ్‌కు సంబంధించిన తాళం పెట్రోల్‌ పంపు మేనేజర్‌ ఇంటికి తీసుకెళ్లడంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వెంటనే పోలీసులు స్పందించి తాళం పగులగొట్టి రెస్ట్‌రూమ్‌ తెరిపించారు. అనంతరం ఆ మహిళ వినియోగదారుల ఫోరమ్‌లో సంబంధిత ఘటనపై ఫిర్యాదు చేశారు. 2024లో కేరళలోని పయ్యోలిలో జరిగిన ఈ సంఘటనపై ఫోరమ్‌ విచారణ జరిపి పెట్రోల్‌ పంపు యాజమాన్యంపై రూ.1.65 లక్షలు జరిమానా విధించారు. పెట్రోల్‌ పంపులో వినియోగదారులకు ఉచితంగా ఎలాంటి వసతులుంటాయో కింద తెలుసుకుందాం.

ఇదీ చదవండి: ప్రయాణంలో రైలు టికెట్‌ చిరిగిపోతే ఫైన్‌ కట్టాలా?

  • దేశంలోని పెట్రోల్ బంకులు వినియోగదారులకు భద్రతను పెంచడానికి వారి సౌలభ్యం కోసం అనే​క సదుపాయాలు అందిస్తాయి.

  • ప్రతి పెట్రోల్‌ పంపు సిబ్బంది విధిగా తమ వద్ద ఫిల్టర్‌ పేపర్‌ ఉంచుకోవాలి. వాహనాల్లో పెట్రోల్‌ కొట్టించుకోవాలనుకున్నప్పుడు పెట్రోల్‌ పంపు సిబ్బంది నుంచి ఫిల్టర్‌ పేపర్‌ అడిగి తీసుకోవాలి. దానిపై పెట్రోల్‌ గన్‌ ద్వారా 2-3 డ్రాప్స్‌ పెట్రోల్‌ వేయాలి. కాసేపు ఆ ఫిల్టర్‌ పేపర్‌ను ఆరనివ్వాలి. తర్వాత పెట్రోల్‌ పోసినచోట పేపర్‌పై ఎలాంటి మచ్చలు ఏర్పడకపోతే అది స్వచ్ఛమైన పెట్రోల్‌గా పరిగణించవచ్చు.

  • పెట్రోల్ బంకులు వాహనాల్లో సరైన టైర్ ప్రెజర్ ఉండేందుకు వీలుగా ఉచిత ఎయిర్ ఫిల్లింగ్ సేవలను అందిస్తాయి.

  • అత్యవసర పరిస్థితుల్లో పెట్రోల్ బంకుల్లో ప్రథమ చికిత్స కిట్లు కూడా అందుబాటులో ఉండాలి.

  • పెట్రోల్ బంకులు అవసరమైతే ఎమర్జెన్సీ కాల్స్ చేసుకునేందుకు వినియోగదారులను అనుమతించాలి.

  • ప్రయాణీకుల కోసం శుభ్రమైన, భద్రత కలిగిన వాష్‌రూమ్‌లు అందుబాటులో ఉండాలి.

  • శుభ్రమైన త్రాగునీరు తరచుగా ఉచితంగా అందించాలి.

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)