Breaking News

పెళ్లిలో వచ్చే కానుకలపై పన్ను ఉంటుందా?

Published on Wed, 08/27/2025 - 18:48

పెళ్లి అంటే రూ.లక్షల ఖర్చుతో కూడిన వ్యవహారం. ముఖ్యంగా భారతీయ వివాహాలు ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తారు. పెళ్లి భోజనాలు ఎంత ఘనంగా వడ్డిస్తారో ఆ పెళ్లికి వచ్చే కానుకలూ అంతే ఘనంగా ఉంటాయి. రూ.లక్షల్లో బహుమతులు చేతికందుతాయి. మరి వీటికి పన్ను ఉంటుందా? చెప్పకుండా దాచేస్తే ఆదాయపు పన్ను శాఖ కనిపెడుతుందా?

పెళ్లి సందర్భంలో వచ్చే కానుకలపై పన్ను అంశం పన్ను చట్టంలో స్పష్టంగా నిర్వచించారు. ఇది ఎవరికి వస్తోంది, ఎప్పుడు వస్తోంది, ఎంత మొత్తం వస్తోంది అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి సంబంధించి  తాజాగా అహ్మదాబాద్ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ITAT) ఇచ్చిన తీర్పు స్పష్టతను తీసుకొచ్చింది. ఈ తీర్పు ప్రకారం, పెళ్లి సందర్భంలో వచ్చిన బహుమతులు, డాక్యుమెంటేషన్‌ సరైనదైతే, పన్ను మినహాయింపు పొందవచ్చు.

పెళ్లి కానుకలపై పన్ను చట్టం ప్రకారం..
పెళ్లి జరిగే వ్యక్తి అంటే పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురుకి వచ్చిన బహుమతులు (నగదు లేదా ఇతరం) ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 56(2)(x) ప్రకారం పన్ను మినహాయింపు పొందుతాయి.  

పెళ్లి జరిగే వ్యక్తి కాకుండా ఇతరులు అంటే వారి తల్లిదండ్రులు, తోడబుట్టినవారు పెళ్లి కానుకలు అందుకుంటే వాటికి సరైన డాక్యుమెంటేషన్‌ ఉంటేనే పన్ను మినహాయింపు ఉంటుంది. సాధారణంగా రూ.50,000కు మించి వచ్చిన బహుమతులను పన్ను వర్తించే ఆదాయంగా పరిగణిస్తారు.

ఇటీవలి ఐటీ ట్రిబ్యునల్‌ తీర్పు
గుజరాత్‌కు చెందిన మనుభాయ్ అనే వ్యక్తి తన కుమారుడి పెళ్లికి రూ.4.31 లక్షల నగదు బహుమతులు స్వీకరించారు. అయితే ఇవి పెళ్లి తేదీ కంటే ముందే వచ్చాయి. దీంతో ఆదాయపు పన్ను శాఖ వీటిని "అస్పష్ట ఆదాయం"గా పేర్కొంటూ పన్ను విధించింది.

దీనిపై కోర్టుకు వెళ్లిన మొదట సీఐటీ (అపీల్స్) వద్ద కేసు కోల్పోయారు.  తరువాత ఐటీఏటీ అహ్మదాబాద్ అప్పీల్ దాఖలు చేశారు. పెళ్లి ఆహ్వాన పత్రిక, అతిథుల జాబితా, వివాహ ధృవపత్రం వంటి ఆధారాలు సమర్పించారు.  2025 ఆగస్టు 12న ట్రిబ్యునల్‌ ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. రూ.4.31 లక్షల ఆదాయంపై పన్ను మినహాయించాలని ఆదేశించింది.

పన్ను చెల్లింపుదారులకు సూచనలు  
పెళ్లిలో వచ్చిన బహుమతులకు రిజిస్టర్ నిర్వహించాలి (పేరు, మొత్తం, తేదీతో సహా).  పెళ్లి ధృవపత్రాలు, ఆహ్వాన పత్రాలు భద్రంగా ఉంచుకోవాలి. పెళ్లిలో కానుకలుగా వచ్చిన ఆదాయాన్ని ఐటీఆర్‌లో మినహాయింపు ఆదాయంగా బహుమతులను ప్రకటించాలి. పూర్తి డాక్యుమెంటేషన్ ఉంటే, పన్ను శాఖ ప్రశ్నించినా రక్షణ పొందవచ్చు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)