Breaking News

‘ఐదు శాతం’తో రూ.1.8 కోట్లు సంపాదన

Published on Mon, 01/06/2025 - 13:29

కొత్త ఏడాదిలోకి ప్రవేశించాం. ఆర్థికంగా మరింత డబ్బు పోగు చేసుకోవాలని అందరూ అనుకుంటారు. కొత్త సంవత్సరంలో కొన్ని మార్గాలు పాటిస్తే సులువుగా ఆర్థిక లక్ష్యాలు(Financial Targets) చేరుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులు తాము చేస్తున్న కొలువు(Job)లో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల రూపంలో అదనంగా సంపాదన అందుకుంటారు. దాన్ని వైవిధ్యంగా ఇన్వెస్ట్‌ చేస్తే సంపాదనను పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. పదోన్నతులు, ఇంక్రిమెంట్ల వల్ల సమకూరే డబ్బును దీర్ఘకాలికంగా పొదుపు చేస్తే మదుపు ఖాతాలో ఇంకొంత సొమ్ము పోగవుతుందని చెబుతున్నారు.

ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల సమయంలో కంపెనీలు అదనంగా అందించే సుమారు ఐదు శాతం(సంస్థను బట్టి ఇది మారుతుంది) డబ్బు భవిష్యత్తులో భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఉదాహరణకు మీకు నెలకు లక్ష రూపాయల జీతం అనుకుందాం. ఏటా ఐదు శాతం ఇంక్రిమెంటును పరిగణిలోకి తీసుకుందాం. మీరు ఇప్పటికే చేసిన పెట్టుబడులు ఏటా పది శాతంమేర రాబడిని ఇస్తున్నట్లు భావిద్దాం. ఇప్పటి దాకా చేస్తున్న ఇన్వెస్ట్‌మెంట్‌ను 15 శాతం నుంచి అదనంగా ఐదు శాతం కలిపి 20 శాతానికి పెంచడం వల్ల జీవనశైలిలో పెద్దగా మార్పు ఉండదు. కానీ దీర్ఘకాలంలో మీరు చేస్తున్న పెట్టుబడి భారీగా పెరిగి ముప్పై ఏళ్ల తర్వాత కనీసం రూ.5.3 కోట్ల స్థానంలో అక్షరాలా రూ.7.1 కోట్లకు పెరుగుతుంది. అంటే కేవలం ఐదు శాతం అదనంగా ఇన్వెస్ట్‌ చేస్తే మీ డబ్బు దాదాపు రూ.1.8 కోట్లు పెరుగుతుంది.

ఇదీ చదవండి: మీకూ అందుతాయి ఐటీ నోటీసులు.. ఎప్పుడంటే..

ముందు పొదుపు తర్వాతే ఖర్చు

ఖర్చు చేసిన తర్వాత మిగిలిన డబ్బును పొదుపు  చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ ముందు పొదుపు తర్వాతే ఖర్చు అనే సూత్రాన్ని పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులు తప్పకుండా ఆరోగ్య బీమా(Health Insurance)తోపాటు జీవిత బీమాను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థతుల్లో ఉద్యోగం పోయినా ఇంటి ఖర్చులు భరించేలా కనీసం ఆరు నెలలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఈ నిధిని వెంటనే నగదుగా మార్చుకునే ఫండ్స్‌ల్లో పెట్టుబడి పెట్టాలని, ఈక్వీటీల జోలికి వెళ్లకూడదని సూచిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)