Breaking News

దీర్ఘకాలంలో బులిష్ గా భారత ఈక్విటీలు

Published on Mon, 12/18/2023 - 06:21

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దీర్ఘకాలికంగా భారతీయ ఈక్విటీలు బులిష్ గా కనిపిస్తున్నాయని బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సీఐవో నిమేష్‌ చందన్‌ చెప్పారు.  అయితే, అంతర్జాతీయంగా రాజకీయ, భోగోళికపరమైన అంశాల కారణంగా కొన్ని ఒడుదుడుకులు ఉండవచ్చన్నారు. ప్రస్తుతం లార్జ్‌ క్యాప్‌ కంపెనీల షేర్లు ఆకర్షణీయమైన వేల్యుయేషన్లతో లభిస్తున్నాయని తెలిపారు.

అటు ఫిక్సిడ్‌ ఇన్‌కం సాధనాల విషయానికొస్తే మెరుగైన ఈల్డ్‌లను లాకిన్‌ చేసుకోవడానికి ఇది సరైన సమయమన్నారు. వడ్డీ రేట్లు క్రమంగా తగ్గే కొద్దీ మధ్యకాలికంగా క్యాపిటల్‌ గెయిన్స్‌పరమైన ప్రయోజనాలు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాము బ్యాలెన్స్‌ అడ్వాంటేజ్‌ ఫండ్‌ను (బీఏఎఫ్‌) ఆవిష్కరించామని, ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల రీత్యా ఇలాంటివి గణనీయంగా రాబడులు అందించే అవకాశం ఉందన్నారు.

బీఏఎఫ్‌తో మరిన్ని ప్రయోజనాలు..
ఈక్విటీ, ఫిక్సిడ్‌ ఇన్‌కమ్‌ సాధనాలకు ఏయే పాళ్లలో ఏ విధంగా పెట్టుబడులను కేటాయించవచ్చనేది బీఏఎఫ్‌లో నిపుణులైన అనుభవజు్ఞల పర్యవేక్షణలో జరుగుతుంది. సాధారణంగా ఈక్విటీ సూచీలతో పోలిస్తే ఈ తరహా ఫండ్స్‌లో ఒడుదుడుకులు తక్కువగా ఉంటాయి. దీర్ఘకాలికంగా కాంపౌండింగ్‌ ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థిక లక్ష్యాలు ఉన్న చాలా మందికి ఈ ఫండ్స్‌ అన్నివేళలా అనువైనవి. బీఏఎఫ్‌ అనేది ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోనూ డైవర్సిఫై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.ఏ ఈక్విటీ లేదా అసెట్‌ అలొకేషన్‌ వ్యూహమైనా సరైన పనితీరు కనపర్చాలంటే కనీసం 3–5 ఏళ్ల పాటు న్వెస్ట్‌మెంట్‌ కొనసాగించాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఫండ్స్‌ విషయంలోనూ ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక దృష్టితో ఉండాలి.
 
ఇక కొత్త ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలా లేక పాత ఫండ్స్‌ (వింటేజ్‌) వైపు చూడాలా అని కొందరిలో మీమాంస ఉండొచ్చు. అయితే, ఫండ్‌ వ్యూహం, తమ అసెట్‌ అలొకేషన్‌కి అది ఎంత వరకు ఉపయోగపడుతుందనేదే చూసుకోవడం మంచిది. సాధారణంగా వింటేజ్‌ ఫండ్స్‌కి ఒక ట్రాక్‌ రికార్డు ఉంటుంది కాబట్టి అందుబాటులో ఉన్న సమాచారంతో తగిన నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుంది. అయితే, ఇన్వెస్ట్‌మెంట్‌ విధానం, మేనేజ్‌మెంట్‌ బృందం మొదలైనవి మారిపోతే వాటి గత పనితీరు అనేది భవిష్యత్తులో అదే విధంగా కొనసాగుతుందనుకోవడానికి ఉండదు. వింటేజ్‌ ఫండ్లు చేసిన తప్పిదాల నుంచి నేర్చుకుని, అలాంటివి పునరావృతం కాకుండా ఉండేలా న్యూ ఫండ్‌ ఆఫర్లు ఉండవచ్చు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)