Breaking News

ఫోన్‌పేలో తగ్గనున్న వాల్‌మార్ట్‌ వాటా

Published on Fri, 01/23/2026 - 05:02

న్యూఢిల్లీ: ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే తలపెట్టిన భారీ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా, కంపెనీలో భాగస్వాములైన కొన్ని సంస్థలు తమ వాటాలను పూర్తిగా విక్రయించి తప్పుకోనుండగా, ప్రధాన వాటాదారు అయిన అమెరికన్‌ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ తన వాటాలను 12 శాతం మేర తగ్గించుకోనుంది. దీనికి సరిసమానమైన 4.59 కోట్ల షేర్లను ఐపీవోలో విక్రయించనుంది. ప్రస్తుతం డబ్ల్యూఎం డిజిటల్‌ కామర్స్‌ హోల్డింగ్స్‌ ద్వారా ఫోన్‌పేలో వాల్‌మార్ట్‌కి 71.77 శాతం వాటాలు ఉన్నాయి. 

ముసాయిదా ప్రాస్పెక్టస్‌ ప్రకారం టైగర్‌ గ్లోబల్, మైక్రోసాఫ్ట్‌ 10.39 లక్షల షేర్లను, మైక్రోసాఫ్ట్‌ గ్లోబల్‌ ఫైనాన్స్‌ 36.78 లక్షల షేర్లను విక్రయించి తప్పుకోనున్నాయి. 15 బిలియన్‌ డాలర్ల వేల్యుయేషన్‌తో 5.08 కోట్ల షేర్ల విక్రయం ద్వారా ఫోన్‌పే దాదాపు 1.5 బిలియన్‌ డాలర్లు సమీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మధ్య నాటికి లిస్ట్‌ అయ్యే అవకాశం ఉంది. 1.7 బిలియన్‌ డాలర్ల టాటా క్యాపిటల్‌ ఇష్యూ తర్వాత ఇది అతి పెద్ద ఐపీవోగా నిలవనుంది. 

డిజిటల్‌ చెల్లింపులు, ఆర్థిక సేవలు అందించే ఫోన్‌పేకి 65.76 కోట్ల మంది రిజిస్టర్డ్‌ యూజర్లు, యూపీఐ లావాదేవీల్లో 45 శాతం మార్కెట్‌ వాటా ఉంది. 2025 సెప్టెంబర్‌ 30తో ముగిసిన 6 నెలల వ్యవధి లో రూ. 3,919 కోట్ల ఆదాయంపై రూ. 1,444 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ ఇండియా నుంచి విడదీసిన ఫోన్‌పే 2016 నుంచి ఇప్పటివరకు రూ. 18,000 కోట్లు సమీకరించింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)