Breaking News

ఈ ఏడాదే భారత్‌లోకి చిన్న ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ

Published on Thu, 03/06/2025 - 08:55

స్వీడిష్‌ లగ్జరీ కార్ల దిగ్గజం వోల్వో తమ చిన్న ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఈఎక్స్‌30ని ఈ ఏడాదే భారత మార్కెట్లో ప్రవేశపెట్టే యోచనలో ఉంది. దేశీయంగా ఏటా ఒక ఎలక్ట్రిక్‌ కారును ప్రవేశపెట్టాలనే వ్యూహానికి అనుగుణంగా దీన్ని తీసుకురానున్నట్లు సంస్థ ఎండీ జ్యోతి మల్హోత్రా తెలిపారు. మిగతా కార్లలాగానే ఈ వాహనాన్ని బెంగళూరు ప్లాంటులో అసెంబుల్‌ చేసి విక్రయించాలని భావిస్తున్నామని, ప్రస్తుతం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

ఓ కొత్త సెగ్మెంట్‌ సృష్టించడం ద్వారా ఇది దేశీయంగా ఈవీల వినియోగం మరింతగా పెరిగేందుకు ఉపయోగపడగలదని మల్హోత్రా చెప్పారు. గతేడాది తాము భారత్‌లో విక్రయించిన ప్రతి నాలుగు కార్లలో ఒకటి ఎలక్ట్రిక్‌దని ఆయన వివరించారు. ఈ విభాగంలో ఎక్స్‌సీ40, సీ40 అని తమకు రెండే కార్లు ఉన్నప్పటికీ వీటి అమ్మకాలు తమ మొత్తం కార్ల విక్రయాల్లో దాదాపు పాతిక శాతానికి చేరినట్లు మల్హోత్రా చెప్పారు. ప్రస్తుతం మాస్‌ మార్కెట్‌ విభాగంలో ఎలక్ట్రిక్‌ కార్ల వినియోగం రెండు శాతంగానే ఉన్నప్పటికీ లగ్జరీ సెగ్మెంట్లో 6–7 శాతంగా ఉన్నట్లు వివరించారు. 2030 నాటికి అంతర్జాతీయంగా 90–100 శాతం ఆదాయాలను ఎలక్ట్రిక్‌ కార్ల నుంచే ఆర్జించాలనే లక్ష్యం దిశగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి: ఇంజినీరింగ్‌ ఎగుమతుల జోరు

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం..ఇది 427 హెచ్‌పీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కేవలం 3.6 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. EX30 రెండు బ్యాటరీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 51 కిలోవాట్ల లిథియం-ఐరన్-ఫాస్ఫేట్ (ఎల్ఎఫ్‌పీ) బ్యాటరీ, 69 కిలోవాట్ల నికెల్-మాంగనీస్-కోబాల్ట్ (ఎన్ఎంసీ) బ్యాటరీలో వస్తుంది. గరిష్టంగా అధిక సామర్థ్యం ఉన్న బ్యాటరీ వేరియంట్‌ ఒకసారి ఛార్జ్‌ చేస్తే 474 కి.మీ వరకు ప్రయాణిస్తుంది.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)