Breaking News

మూడు ప్లాంట్ల మూసివేత.. 10 వేల మందికి ఉద్వాసన!

Published on Tue, 10/29/2024 - 19:56

జర్మనీకి చెందిన ఆటోమొబైల్‌ తయారీ సంస్థ వోక్స్‌వ్యాగన్ తన ప్లాంట్లను మూసివేయాలని యోచిస్తోంది. దాంతోపాటు కాస్ట్‌ కటింగ్‌ ప్రణాళికలో భాగంగా మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10,000 మందిని తొలగించనున్నట్లు కంపెనీ వర్క్స్‌ కౌన్సిల్‌ హెడ్‌ డానియెలా కావల్లో తెలిపారు. అంతర్జాతీయంగా కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్‌ తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొందని చెప్పారు.

ఈ సందర్భంగా డానియెలా కావల్లో మాట్లాడుతూ..‘యూరప్‌లో వోక్స్‌వ్యాగన్‌ సంస్థ తన తయారీ యూనిట్ల సంఖ్యను తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కంపెనీ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్‌ తగ్గిపోతోంది. దాంతో యూరప్‌లో మూడు ప్లాంట్లను మూసివేయాలని నిర్ణయించాం. అయితే ఏ ప్లాంట్లను నిలిపేయాలో ఇంకా స్పష్టత రాలేదు. కంపెనీలో పని చేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10,000 మందిని కొలువుల నుంచి తొలగించనున్నాం. జర్మనీలోని వోక్స్‌వ్యాగన్ గ్రూప్‌లో దాదాపు 3,00,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు’ అని చెప్పారు.

ఇదీ చదవండి: ఉద్యోగులకు టీ, కాఫీ నిలిపివేత!

వోక్స్‌వ్యాగన్‌ కంపెనీ ఉత్పత్తులకు ప్రధాన కొనుగోలుదారులుగా ఉన్న చైనా, యూరప్‌ నుంచి డిమాండ్‌ తీవ్రంగా పడిపోయింది. దానికితోడు నిర్వహణ ఖర్చులు పెరగడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలోనూ కంపెనీ ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి ఆదరణ కరవైంది. దాంతో చేసేదేమిలేక చివరకు ఉద్యోగుల తగ్గింపునకు పూనుకున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)