Breaking News

మొదటి విద్యుత్‌కారును ఆవిష్కరించిన ఫేమస్‌ కంపెనీ

Published on Fri, 03/22/2024 - 12:06

ప్రపంచవ్యాప్తంగా ఇకపై పూర్తిగా విద్యుత్‌ కార్లనే తయారు చేసి విక్రయించాలని జర్మనీ వాహన సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌ నిర్ణయించుకుంది. తాజాగా భారత్‌లో తన మొదటి విద్యుత్‌ కారు ‘ఐడీ.4’ను ఆవిష్కరించింది. 

గ్లోబల్‌గా ఉన్న ప్రముఖ కార్ల తయారీ సంస్థలు కొత్త పంథాను అనుసరిస్తున్నాయి. క్రమంగా దాదాపు అన్ని కంపెనీలు ఈవీవైపు మొగ్గుచూపుతున్నాయి. అందులో భాగంగా తాజాగా ఫోక్స్‌వ్యాగన్‌ భారత్‌లో విద్యుత్‌ వాహన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ ఏడాదిలోనే ఈ కారును విపణిలోకి విడుదల చేయనున్నట్లు ఫోక్స్‌వ్యాగన్‌ ప్యాసింజర్‌ కార్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (సేల్స్‌ ఇంటర్నేషనల్‌ ఆపరేషన్స్‌) మైఖేల్‌ మేయర్‌ తెలిపారు. 

ఐడీ.4ను రెండు వేరియంట్‌లతో తీసుకోస్తున్నారు. 62 కిలోవాట్‌అవర్‌ సామర్థ్యం ఉన్న వేరియంట్‌ ఒక్కఛార్జ్‌లో 336 కిమీ వరకు వెళ్లగలదు. సింగిల్-మోటార్, రియర్-వీల్-డ్రైవ్‌తో అందుబాటులో ఉంటుంది. రెండోది 82 కిలోవాట్‌అవర్‌ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ఒక్కఛార్జ్‌తో 443 కిమీలు వెళ్లగలదు. సింగిల్-మోటార్, డ్యూయల్-మోటార్, ఆల్-వీల్-డ్రైవ్‌తో మార్కెట్‌లో రానుంది. ధరకు సంబంధించి కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే రూ.50లక్షలు-రూ.60లక్షల మధ్య ధర ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. త్వరలో ఈ కారును మార్కెట్‌లోని తీసుకురానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి: క్రెడిట్‌ కార్డులు వాడుతున్నారా..? కీలక మార్పులు చేసిన బ్యాంకులు

ఈ ఏడాది భారత ప్రయాణికుల వాహన విపణి 5-7 శాతం మేర పెరిగే అవకాశం ఉందని.. తాము 10-15 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. క్రమంగా విద్యుత్‌కార్లను ఆవిష్కరణను పెంచుతూ సమీప భవిష్యత్తులో పూర్తిగా ఈవీలను తయారుచేస్తామని మేయర్‌ తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రపంచవ్యాప్తంగా ఫోక్స్‌వ్యాగన్‌ ముందు వరుసలో ఉందని చెప్పారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)